Headache | తల‌నొప్పి వ‌చ్చింద‌ని గూగుల్ సెర్చ్..! ఆ త‌ర్వాత ఏం చేశాడో తెలుసా..?

Headache | త‌ల‌నొప్పి రావ‌డం స‌హ‌జం. కాసేపు విశ్రాంతి తీసుకుంటే త‌ల‌నొప్పి మాయ‌మైపోతోంది. మ‌రి తీవ్రంగా ఉంటే డాక్ట‌ర్‌ను సంప్ర‌దిస్తారు. వైద్యుడి స‌ల‌హా మేర‌కు మెడిసిన్స్ వాడుతారు. అప్ప‌టికీ త‌గ్గ‌క‌పోతే స్కానింగ్ చేసి, అవ‌స‌ర‌మైన వైద్యాన్ని అందిస్తారు. ఇదంతా సేఫ్ ట్రీట్‌మెంట్. కానీ ఇటీవ‌ల కాలంలో చాలా మంది వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం లేదు. గూగుల్‌లో సెర్చ్ చేసి లేదా యూట్యూబ్‌లో వీడియోలు చూసి సొంతంగా ట్రీట్‌మెంట్ చేసుకుంటున్నారు. కానీ అది చాలా ప్ర‌మాదక‌రం. కొన్ని సంద‌ర్భాల్లో ప్రాణాలు పోయే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. దీనికి ఈ సంఘ‌ట‌నే ఉదాహ‌ర‌ణ‌.

  • By: raj    health    May 24, 2024 11:40 PM IST

హైద‌రాబాద్‌లో నివాస‌ముంటున్న ఓ 31 ఏండ్ల వ్య‌క్తికి ఇటీవ‌లే తీవ్ర‌మైన త‌ల‌నొప్పి వ‌చ్చింది. రెండు రోజులైనా కూడా త‌ల‌నొప్పి త‌గ్గ‌లేదు. దీంతో తల‌నొప్పికి కార‌ణాలు ఏంటి..? నివార‌ణ చ‌ర్య‌లు ఏంటి..? అనే విష‌యాల‌ను అత‌ను గూగుల్‌లో సెర్చ్ చేశాడు. బ్రెయిన్ హెమ‌రేజ్‌(మెద‌డులో ర‌క్త‌స్రావం జ‌ర‌గ‌డం) అని గూగుల్ సెర్చ్‌లో ఆయ‌న‌కు స‌మాధానం దొరికింది. దీంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన అత‌ను.. ప్రముఖ న్యూరాల‌జిస్ట్ డాక్ట‌ర్ సుధీర్ కుమార్‌ను సంప్ర‌దించాడు.

ఈ సంద‌ర్భంగా న్యూరాలజిస్ట్ డాక్ట‌ర్ సుధీర్ కుమార్ అత‌ని గురించి కొన్ని వివ‌రాల‌ను ఎక్స్ వేదిక‌గా పంచుకున్నారు. అత‌ను త‌న వ‌ద్ద‌కు రాగానే.. అత‌ను చెప్పిన ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి ఎలాంటి బ్రెయిన్ హేమ‌రేజ్ లేద‌ని చెప్పి పంపొచ్చు. కానీ అత‌ని మ‌న‌సులో ఆందోళ‌న ఉంట‌ది. కాబ‌ట్టి అత‌న్ని పూర్తిగా ప‌రీక్షించి, 10 నుంచి 15 నిమిషాల పాటు కౌన్సెలింగ్ చేసి పంపించిన‌ట్లు సుధీర్ కుమార్ తెలిపారు.

త‌ల‌నొప్పి ఎందుకు వ‌స్తుందంటే.. ఉద్యోగం ఒత్తిడి, స‌మ‌యానికి మించి కంప్యూట‌ర్ వాడ‌కం వ‌ల్ల కండ‌రాల్లో ఒత్తిడి ఏర్ప‌డి త‌ల‌నొప్పి రావ‌డానికి ఆస్కారం ఉంటుంది. మెద‌డులో ర‌క్త‌స్రావం జ‌రిగితే బ్రెయిన్ హేమ‌రేజ్ రావ‌డానికి చాన్స్ ఉంటుందని చెప్పాను. అంతేకాకుండా బ్రెయిన్ హేమ‌రేజ్‌కు కావాల్సిన ట్రీట్‌మెంట్ ఆప్ష‌న్లు కూడా అత‌నికి వివ‌రించాను. సీటీ స్కాన్ అవ‌స‌ర‌మా..? కాదా..? అనే విష‌యాల‌ను కూడా చెప్పాను. ఇదంత వివ‌రించ‌డానికి 10 నుంచి 15 నిమిషాల స‌మ‌యం ప‌ట్టింది. అప్పుడు అత‌ను త‌ల‌నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొందారు. ఐసోమెట్రిక్ నెక్ వ్యాయమాలు చేయ‌మ‌ని సూచ‌న చేశాను. ప‌ని చేసే స‌మ‌యంలో కాస్త విశ్రాంతి తీసుకోవాల‌ని చెప్పాను. సాధ్య‌మైనంత వ‌ర‌కు బాగా నిద్రించాల‌ని, ఒత్తిడికి దూరంగా ఉండాల‌ని సూచించాను. బ‌హుషా రేపు ఉద‌యం అత‌ను నిద్ర లేచేస‌రికి త‌ల‌నొప్పి ల‌క్ష‌ణాలు మాయం అయ్యే అవ‌కాశం ఉంద‌ని సుధీర్ కుమార్ పేర్కొన్నారు.