ఆమె గ‌ర్భిణి అని తేల్చేసిన‌ యాపిల్ వాచ్..

విధాత: ఓ మహిళ గ‌ర్భం ధ‌రించిందా? లేదా? అని తెలుసుకునేందుకు సాధార‌ణంగా గైన‌కాల‌జిస్టును సంప్ర‌దిస్తాం. లేదంటే.. ప్రెగ్నెన్సీ కిట్ స‌హాయంతో ప‌రీక్ష నిర్వ‌హిస్తాం. ఈ రెండింటి ద్వారా స‌ద‌రు మ‌హిళ గ‌ర్భిణా? కాదా? అనే విష‌యాన్ని తేల్చుతాం. కానీ ఈ రెండు కాకుండా ఓ యాపిల్ వాచ్‌.. ఆమె గ‌ర్భిణి అని తేల్చేసింది. శాన్ ఫ్రాన్సిస్‌కోకు చెందిన ఓ 34 ఏండ్ల గ‌త కొంత‌కాలం నుంచి యాపిల్ వాచ్ ధ‌రిస్తుంది. అయితే ఓ 15 రోజుల నుంచి […]

  • By: krs    health    Oct 11, 2022 3:14 AM IST
ఆమె గ‌ర్భిణి అని తేల్చేసిన‌ యాపిల్ వాచ్..

విధాత: ఓ మహిళ గ‌ర్భం ధ‌రించిందా? లేదా? అని తెలుసుకునేందుకు సాధార‌ణంగా గైన‌కాల‌జిస్టును సంప్ర‌దిస్తాం. లేదంటే.. ప్రెగ్నెన్సీ కిట్ స‌హాయంతో ప‌రీక్ష నిర్వ‌హిస్తాం. ఈ రెండింటి ద్వారా స‌ద‌రు మ‌హిళ గ‌ర్భిణా? కాదా? అనే విష‌యాన్ని తేల్చుతాం. కానీ ఈ రెండు కాకుండా ఓ యాపిల్ వాచ్‌.. ఆమె గ‌ర్భిణి అని తేల్చేసింది.

శాన్ ఫ్రాన్సిస్‌కోకు చెందిన ఓ 34 ఏండ్ల గ‌త కొంత‌కాలం నుంచి యాపిల్ వాచ్ ధ‌రిస్తుంది. అయితే ఓ 15 రోజుల నుంచి ఆమె హృద‌య స్పంద‌న‌లో తేడాలు వ‌చ్చాయి. ఈ హృద‌య స్పంద‌న రేటు ఎప్ప‌టిక‌ప్పుడు ఆమె యాపిల్ వాచ్‌లో అప్‌డేట్ అవుతూనే ఉంది.

అయితే ఆ మ‌హిళ సాధార‌ణ హృద‌య స్పంద‌న రేటు 57. కానీ అది 72కు చేరింది. దీంతో అనుమానం వ‌చ్చి ఆమె టెస్టు చేసుకోగా ప్రెగ్నెన్సీ అని తేలింది. తాను గ‌ర్భం ధ‌రించాన‌ని త‌న‌కు తెలియ‌క ముందే.. త‌న యాపిల్ వాచ్‌కు తెలిసి పోయింద‌ని ఆమె పేర్కొన్నారు. యాపిల్ వాచ్ త‌న ప్రెగ్నెన్సీని నిర్ధారించింద‌ని చెప్ప‌డానికి సంతోషంగా ఉంద‌న్నారు.

ప్రెగ్నెన్సీ నిర్ధార‌ణ అయిన త‌ర్వాత మ‌హిళ‌ల గుండె వేగం పెరుగుతోంది. యాపిల్ వాచ్ ధ‌రించ‌డం వ‌ల్ల హృద‌య స్పంద‌న రేటు ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌డంతో.. చాలా మంది అప్ర‌మ‌త్తంగా ఉంటున్నారు. ఏదైనా కొంచెం తేడా అనిపిస్తే చాలు.. సంబంధిత డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దిస్తున్నారు. గుండె నొప్పుల నుంచి బ‌య‌ట‌ప‌డుతున్నారు.