beauty tips | నిగనిగలాడే.. పొడవాటి జుట్టు కావాలా..? ఇలా ఈ వంటింటి చిట్కాలు ట్రై చేసి చూడండి.. మీరే నమ్మలేరు..!

beauty tips | పొడవాటి నల్లటి జుట్టు అందాన్ని మరింత మెరుగుపరుస్తుంది. దీంతో అమ్మాయిలతో పాటు చాలా మంది నల్లని, పొడవైన కురులను కలిగి ఉండాలని కోరుకుంటారు. చాలా మంది పొడగాటి జుట్టుకోసం చేయని ప్రయత్నాలుండవు. మందపాటి జుట్టును పొందడం అంత తేలికైన పని కాదు. వాతావరణ కాలుష్యం, మారుతూ వస్తున్న జీవనశైలి కారణంగానే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. జుట్టు పెరుగుదల ఆగిపోవడంతో పాటు పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. ఈ పరిస్థితుల్లో కొన్ని నూనెలను వాడడం […]

beauty tips | నిగనిగలాడే.. పొడవాటి జుట్టు కావాలా..? ఇలా ఈ వంటింటి చిట్కాలు ట్రై చేసి చూడండి.. మీరే నమ్మలేరు..!

beauty tips | పొడవాటి నల్లటి జుట్టు అందాన్ని మరింత మెరుగుపరుస్తుంది. దీంతో అమ్మాయిలతో పాటు చాలా మంది నల్లని, పొడవైన కురులను కలిగి ఉండాలని కోరుకుంటారు. చాలా మంది పొడగాటి జుట్టుకోసం చేయని ప్రయత్నాలుండవు. మందపాటి జుట్టును పొందడం అంత తేలికైన పని కాదు. వాతావరణ కాలుష్యం, మారుతూ వస్తున్న జీవనశైలి కారణంగానే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. జుట్టు పెరుగుదల ఆగిపోవడంతో పాటు పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. ఈ పరిస్థితుల్లో కొన్ని నూనెలను వాడడం ద్వారా జట్టు నిగనిగ మెరవడంతో పొడవాటి జుట్టు మీ సొంతమవుతుంది. ఆయా నూనెల తలకు పట్టించడం ద్వారా తలలో రక్త ప్రసరణ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో జుట్టు పెరుగూ వస్తుంది. మందంగా, బలంగా మారుతుంది.

ఇలా ట్రై చేయండి..

  • కొద్దిపాటి కొబ్బరి నూనెలో నూనె తీసుకొని అందులో మెంతి గింజలు వేసి వేయి చేయాలి. ఆ తర్వాత జట్టుకు నూనెను పట్టించి.. మెల్లిగా మసాజ్‌ చేయాలి. దీంతో తలలో రక్త ప్రసరణ మెరగువుతుంది. ఫలితంగా జుట్టు పొడవుగా పెరగడంతో పాటు నిగనిగలాడుతుంది.
  • మెంతుల్లో విటమిన్‌ ఏ, సీ, కాల్షియం, పొటాషియం, ఐరన్‌ ఉంటాయి. ఇది మీ జట్టుకు సంబంధించి సమస్యలను తగ్గించడంలో సహాయపడడంతో పాటు జట్టు అందాన్ని పెంచడంలో ఉపయోగకరంగా ఉంటుంది.
  • మందారపువ్వులు, కొబ్బరి నూనెతోనూ అద్భుతమైన ఫలితాలుంటాయి. కొన్ని మందారపువ్వులను తీసుకొని మెత్తగా రుబ్బి కొబ్బరి నూనెలో వేయాలి. ఆ తర్వాత పొయ్యిపై పెట్టి కాస్త నూనెలో కొద్దిసేపు ఉడికించాలి. ఆ తర్వాత కొద్దిగా చల్లరిన తర్వాత మెల్లిగా మసాజ్‌ చేసుకోవాలి. అనంతరం రెండు మూడు గంటల తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి.
  • ఉల్లిరసం, కొబ్బరినూనె తయారు చేసుకుంటు జుట్టు ఆరోగ్యానికి మంచి ఫలితం ఉంటుంది. మొదట ఉల్లిరసాన్ని తీసి.. ఆ తర్వాత కొబ్బరినూనెలో పోసుకొని వేడి చేసుకోవాలి. చల్లారిన తర్వాత తలకు పట్టించి, మసాజ్‌ చేసుకోవాలి. ఇలా చేస్తూ వస్తుంటే జట్టు రాలడం తగ్గుతుంది. కనీసం వారానికి ఒకసారి ట్రై చేయండి.