CANCER: దేశంలో ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్.. 15 మందిలో ఒకరు మృతి

భార‌త్‌లో ప్ర‌మాద‌క‌ర స్థాయిలో విస్త‌రణ‌ వృద్ధికి జీవ‌న విధానమే ప్ర‌ధాన‌ కార‌ణం: WHO ప్రాణాంత‌క‌మైన వ్యాధుల‌లో క్యాన్సర్‌ది ప్ర‌థ‌మ స్థానం. క్యాన్సర్.. రోజు రోజుకు విజృంభిస్తూ రోగాలల్లో రారాజు అవుతుంది. ఇలాంటి త‌రుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) భ‌యంక‌ర‌మైన గ‌ణాంకాలు విడుదల చేసింది.. ఆ గణాంకాలు చూస్తే ప్ర‌మాదం ఏ స్థాయిలో ఉందో చాలా స్పష్టంగా తెలుస్తుంది. విధాత‌: WHO నివేదిక ప్రకారం భార‌త‌దేశంలో క్యాన్స‌ర్ నిశ్శ‌బ్దంగా తీవ్ర స్థాయిలో విస్త‌రిస్తోంద‌ని తెలుస్తోంది. దేశంలో ప్ర‌తీ పది […]

  • By: Somu    health    Feb 18, 2023 11:34 AM IST
CANCER: దేశంలో ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్.. 15 మందిలో ఒకరు మృతి
  • భార‌త్‌లో ప్ర‌మాద‌క‌ర స్థాయిలో విస్త‌రణ‌
  • వృద్ధికి జీవ‌న విధానమే ప్ర‌ధాన‌ కార‌ణం: WHO

ప్రాణాంత‌క‌మైన వ్యాధుల‌లో క్యాన్సర్‌ది ప్ర‌థ‌మ స్థానం. క్యాన్సర్.. రోజు రోజుకు విజృంభిస్తూ రోగాలల్లో రారాజు అవుతుంది. ఇలాంటి త‌రుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) భ‌యంక‌ర‌మైన గ‌ణాంకాలు విడుదల చేసింది.. ఆ గణాంకాలు చూస్తే ప్ర‌మాదం ఏ స్థాయిలో ఉందో చాలా స్పష్టంగా తెలుస్తుంది.

విధాత‌: WHO నివేదిక ప్రకారం భార‌త‌దేశంలో క్యాన్స‌ర్ నిశ్శ‌బ్దంగా తీవ్ర స్థాయిలో విస్త‌రిస్తోంద‌ని తెలుస్తోంది. దేశంలో ప్ర‌తీ పది మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారని, ప్రతి పదిహేను మందిలో ఒకరు చనిపోతున్నారని గ‌ణాంకాలు చెప్తున్నాయి.

ప్రస్తుత రిపోర్ట్ ప్రకారం దేశంలో స‌గ‌టున‌ ఎనిమిది లక్షల కేసులు నమోదు అవుతుండగా రాబోయే కొన్ని సంవత్సరాలలో ఇది మూడింతలు అయ్యే అవకాశం వుందని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అంటే సాలీనా ఇరవై నాలుగు లక్ష‌ల‌ కేసులు వచ్చే అవకాశం వుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు పొగాకు, మద్యపానం, వాతావరణ కాలుష్యం లాంటి కారణాల వలన క్యాన్సర్ కేసుల పెరుగుదలకు కారణంగా వుండేవి. కానీ, ఇప్పుడు మారిన జీవన విధానంతోనే క్యాన్సర్ వేగంగా వృద్ధి చెందుతుంద‌ని ఆ రిపోర్ట్ పేర్కొంది.

మారిన ఆహారపు అలవాట్ల వలన వచ్చే అధిక బరువు, దైనందిత జీవితం లో శారీరక శ్రమ అనేది లేకపోవడం వంటివి కూడా రాబోయే రోజుల్లో క్యాన్సర్ కేసులు పెరగడానికి దోహదం చేస్తాయ‌ని WHO నివేదిక‌ హెచ్చ‌రిస్తోంది.

ఇప్ప‌టికైనా ఆరోగ్య‌క‌ర‌మైన జీవన విధానాలను అలవాటు చేసుకోవడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం ఆరంభిస్తే క్యాన్సర్ కేసులను చాలా వరకు తగ్గించే అవకాశం ఉందని WHO సూచిస్తుంది.