Chyawanprash | ఈ స‌మ‌స్య‌లున్న వారు చ్య‌వాన్‌ప్రాష్ తిన‌కూడ‌దు..!

Chyawanprash | చ‌లికాలం వ‌చ్చిందంటే చాలు చాలామంది చ్యవాన్‌ప్రాష్ తింటుంటారు. దీన్ని ఓ ఔష‌ధంగా భావిస్తారు. ఎందుకంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తేనె, కుంకుమపువ్వు, త‌దిత‌ర 50 మూలికాల‌ను క‌లిపి చేస్తారు. శీతాకాలం మిమ్మ‌ల్ని వెచ్చ‌గా ఉంచుతుంది. అయితే, చ్య‌వాన్‌ప్రాష్‌ను అంద‌రు తినేందుకు ప‌నికిరాదు. కొన్ని స‌మ‌స్య‌లున్న వారు తింటే లాభం క‌న్నా.. న‌ష్ట‌మే ఎక్కువగా ఉంటుంది. ఎవ‌రు తిన‌కూడ‌దంటే.. మ‌ధుమేహం బాధితులు పొర‌పాటున కూడా చ్యవానప్రాష్ తినకూడదు. ఎందుకంటే చ్యవాన్‌ప్రాష్ రుచిని సమతుల్యం చేయడానికి, ఇందులో తీపి […]

Chyawanprash | ఈ స‌మ‌స్య‌లున్న వారు చ్య‌వాన్‌ప్రాష్ తిన‌కూడ‌దు..!

Chyawanprash | చ‌లికాలం వ‌చ్చిందంటే చాలు చాలామంది చ్యవాన్‌ప్రాష్ తింటుంటారు. దీన్ని ఓ ఔష‌ధంగా భావిస్తారు. ఎందుకంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తేనె, కుంకుమపువ్వు, త‌దిత‌ర 50 మూలికాల‌ను క‌లిపి చేస్తారు. శీతాకాలం మిమ్మ‌ల్ని వెచ్చ‌గా ఉంచుతుంది. అయితే, చ్య‌వాన్‌ప్రాష్‌ను అంద‌రు తినేందుకు ప‌నికిరాదు. కొన్ని స‌మ‌స్య‌లున్న వారు తింటే లాభం క‌న్నా.. న‌ష్ట‌మే ఎక్కువగా ఉంటుంది.

ఎవ‌రు తిన‌కూడ‌దంటే..

  • మ‌ధుమేహం బాధితులు పొర‌పాటున కూడా చ్యవానప్రాష్ తినకూడదు. ఎందుకంటే చ్యవాన్‌ప్రాష్ రుచిని సమతుల్యం చేయడానికి, ఇందులో తీపి ప‌దార్థాల‌ను వాడుతారు. చ్యవాన్‌ప్రాష్‌లో ఉండే చక్కెర శరీరంలోని రక్తంలో షుగ‌ర్ లెవెల్స్‌ను పెంచుతుంది.
  • చ్యవన్‌ప్రాష్‌కు వేడిని క‌లిగించే గుణం ఉంటుంది. త్వ‌ర‌గా జీర్ణంకావ‌డం క‌ష్టం. కిడ్నీ సంబంధిత వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్ల‌యితే పొర‌పాటున కూడా చ్యవాన్‌ప్రాష్‌ను తినొద్దు.
  • ఉదర సమస్యలతో బాధపడేవారు చ్యవనప్రాష్ తినకూడదు. ఎందుకంటే చ్యవనప్రాష్‌ని జీర్ణం అవ‌డంతో స‌మ‌స్య‌లు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంది. అలాంటి వారు తిన‌డం మానుకోవాలి.
  • ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డుతున్న వారు సైతం చ్యవన్‌ప్రాష్‌కు దూరంగా ఉండాలి. చ్యవాన్‌ప్రాష్‌కు వేడిని క‌లిగించే గుణం ఉంటుంది. దాంతో బీపీ పెరిగే అవ‌కాశం ఉంటుంది.