శీతాకాలం వ్యాధులు తరిమికొట్టాలంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి..!

Winter Health Tips | శీతాకాలంలో చలిగాలులు వీస్తున్నాయి. ఈ విపరీతమైన చలి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దాంతో వ్యాధులు త్వరగా సోకుతాయి. జలుబు కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఈ సీజన్‌లో వ్యాధులబారినపడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా జలుబుతో పాటు కొన్ని వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి.. వెచ్చని దుస్తులు ధరించాలి వెచ్చని బట్టలు చలి నుంచి శరీరాన్ని కాపాడతాయి. కొన్ని వెచ్చటి దుస్తులు వేసుకున్నా […]

శీతాకాలం వ్యాధులు తరిమికొట్టాలంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి..!

Winter Health Tips | శీతాకాలంలో చలిగాలులు వీస్తున్నాయి. ఈ విపరీతమైన చలి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దాంతో వ్యాధులు త్వరగా సోకుతాయి. జలుబు కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఈ సీజన్‌లో వ్యాధులబారినపడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా జలుబుతో పాటు కొన్ని వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి..

వెచ్చని దుస్తులు ధరించాలి
వెచ్చని బట్టలు చలి నుంచి శరీరాన్ని కాపాడతాయి. కొన్ని వెచ్చటి దుస్తులు వేసుకున్నా చలి ఆగదు. అలాంటి సందర్భాల్లో తలపై టోపీ, చేతులకు, కాళ్లకు సాక్స్, లోపల స్కార్ఫ్ థర్మల్ వేర్ ధరించాలి. పైన మందపాటి జాకెట్ లేదంటే స్వెటర్ ధరించాలి. తద్వారా జలుబు, వ్యాధుల నుంచి రక్షణగా ఉంటుంది.

శరీరాన్ని వేడిగా ఉంచుకోవాలి
వెచ్చటి దుస్తులు ధరిస్తే పైనుంచే నుంచి వచ్చే గాలి నుంచి రక్షణగా ఉంటుంది. కానీ, శీతాకాలంలో వ్యాధులను నివారించేందుకు అంతర్గతంగా శరీరం వేడిగా ఉండాలి. ఈ క్రమంలో శరీరంలో వేడిని పెంచే పదార్థాలు తీసుకోవాలి. ఫ్రిజ్‌లో ఉంచిన వస్తువులు, పదార్థాలకు దూరంగా ఉండాలి.

ఇంట్లో వాతావరణం..
చాలా మంది చలికాలంలో కూడా ఏసీ, కూలర్‌ లేనిదే నిద్రపోరు. అలాంటి వారు వాటికి దూరంగా ఉండాలి. చల్లని గాలి ఇంట్లోకి రాకుండా ఇంటి కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. ఇంట్లో కూర్చోవడంతో చల్లటి గాలి నేలను చల్లబరుస్తుంది. చల్లని నేలపై కూర్చోకుండా నేలపై చాప లేదంటే ఎదైనా బట్టను వేసుకొని కూర్చోవడం మంచిది.

చల్లని నీటికి దూరంగా..
చలికాలంలో నీటిలో తడవడం మంచిది కాదు. నీటికి దూరంగా ఉండండి. చల్లని నీటిని ఉపయోగించవద్దు. వేడి నీళ్లతో తలస్నానం చేయాలి. జుట్టు తడి కారణంగా జలుబు త్వరగా వస్తుంది. కాబట్టి జుట్టును ఎక్కువగా కడగొద్దు. శరీరాన్ని సరిగ్గా ఆరబెట్టిన తర్వాత బట్టలు ధరించాలి.

సరిపడా నీరు తాగాలి
చలికాలంలో తక్కువ నీరు తాగుతారు. దాంతో శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. రోగాలు రాకుండా ఉండాలంటే నీళ్లు తాగాల్సిందే. రోజూ సరిపడా నీళ్లు తాగాలి. కొన్ని పండ్ల రసాలను మీ ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా కూడా శరీరంలో నీటి శాతం పెరుగుతుంది.