Egg for Health | రోజుకో ఉడుకబెట్టిన కోడిగుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలట.. అదేమిటంటే..!

Egg for Health | రోజుకో ఉడుకబెట్టిన కోడిగుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలట.. అదేమిటంటే..!

Egg for Health : సాధారణంగా మనం ఆహారంగా తీసుకునే ప్రతి పదార్థంలో ఆరోగ్యానికి మేలుచేసే పోషకాలుంటాయి. అయితే కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల్లో ఎక్కువ ఆరోగ్య ప్రయోజానాలున్న పోషకాలుంటే.. కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల్లో త‌క్కువ ఆరోగ్య ప్రయోజ‌నాలున్న పోషకాలుంటాయి. ఇక అధిక ప్రయోజనంగల పోషకాలున్న ఆహార ప‌దార్థాల విషయానికి వస్తే.. కోడిగుడ్డు ముందు వ‌రుస‌లో ఉంటుంది. మ‌నం రోజుకొక ఉడుక‌బెట్టిన కోడిగుడ్డు తింటే ఆరోగ్యప‌రంగా ఎన్నో లాభాలుంటాయి. మరి అవేంటో తెలుసుకుందాం..

గుడ్డుతో ప్రయోజనాలు..

1. కోడిగుడ్ల ద్వారా శరీరానికి ర‌క‌ర‌కాల‌ పోషకాలు లభిస్తాయి. శరీరానికి కావాల్సిన సాచురేటెడ్ ఫ్యాట్స్‌, పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అదేవిధంగా పొటాషియం, విటమిన్-A, కాల్షియం, ఐరన్, విటమిన్-D, విటమిన్ B6, విటమిన్ B12, మెగ్నీషియం గుడ్డులో పుష్కలంగా ల‌భిస్తాయి.

2. కోడిగుడ్డు మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్డు సొనలో ఉండే కోలిన్ అనే పోషక పదార్థం మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

3. కోడిగుడ్డులోని ఐరన్‌ను శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఈ ఐరన్ గర్భిణులు, బాలింతలకు బాగా ఉపయోగపడుతుంది. కాబ‌ట్టి గ‌ర్భిణులు, బాలింత‌లు ప్రతిరోజు ఉడుక‌బెట్టిన కోడిగుడ్డు తీసుకోవాలి.

4. గుడ్డులో ఉండే పోషక విలువలవల్ల ఇది మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా నిరోధించడంలో కూడా తోడ్పడుతుంది.

5. జట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉండేందుకూ గుడ్డు ఉపయోగపడుతుంది. గుడ్డులోని విటమిన్-A కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.

6. గుడ్డులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉండ‌టంవ‌ల్ల అవి ఎముకలు గట్టిపడటానికి తోడ్పడుతాయి.

7. నరాల బలహీనత ఉన్నవారు కూడా ప్రతిరోజూ క్రమం తప్పకుండా గుడ్డును తీసుకోవడంవ‌ల్ల ప్రయోజ‌నం ఉంటుంది. అంతేగాక గుండె రక్తనాళాలకు కూడా కోడిగుడ్డుతో మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.