ఆలుమ‌గ‌లు ఈ ఆహారం తింటే సంతోషం, సంతానం..!

దాంప‌త్య జీవితం అన్యోన్యంగా కొన‌సాగాలంటే ఆలుమ‌గ‌ల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు ఉండ‌కూడ‌దు. ఒక‌రినొక‌రు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి

ఆలుమ‌గ‌లు ఈ ఆహారం తింటే సంతోషం, సంతానం..!

దాంప‌త్య జీవితం అన్యోన్యంగా కొన‌సాగాలంటే ఆలుమ‌గ‌ల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు ఉండ‌కూడ‌దు. ఒక‌రినొక‌రు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. అంతేకాదు ఆలుమ‌గ‌ల మ‌ధ్య సుఖ‌మైన శృంగార జీవితం కొన‌సాగాలన్నా.. సంతానం క‌ల‌గాల‌న్నా కొన్ని ఆహార నియ‌మాలు త‌ప్ప‌క పాటించాల్సిందే. అప్పుడే సంతోషం, సంతానం క‌లుగుతుంద‌ని ఆహార నిపుణులు పేర్కొంటున్నారు.

బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలంటే..?

ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌రిచే ఆహార ప‌దార్థాలు బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండే విధంగా చూసుకోవాలి. బెర్రీలు, బాదం, అవ‌కాడో, కోడిగుడ్లను అల్పాహారంలో త‌ప్ప‌నిస‌రి చేసుకోవాలి. పెరుగు కూడా తినాలి. బెర్రీస్‌లో ర‌క్త ప్ర‌వాహానికి తోడ్ప‌డే ఫ్లేవ‌నాయిడ్స్ ఎక్కువ‌గా ఉంటాయి. క‌ల‌యిక స‌మ‌యంలో పురుషుల ప‌నితీరుకు ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. బాదంలో బీ విట‌మిన్ కార‌ణంగా హార్మోన్ల ఉత్ప‌త్తికి తోడ్ప‌డుతుంది. పెరుగులో జింక్, విట‌మిన్ బీ 12, మెగ్నీషియం ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం స్త్రీల ఆరోగ్యాన్ని ఆప్టిమైజ్ చేస్తాయి. అవ‌కాడోలో విట‌మిన్ ఈ ఉంటుంది. ఇది వాసోడైలేషన్‌కు సహాయపడుతుందని తత్ఫలితంగా కలయిక సమయంలో ఎంతో ఉపకరిస్తుంది. కోడి గుడ్ల‌లో ఆమైనో ఆమ్లం ఎల్ అర్జినైన్ ఉంటుంది. ఇది కూడా పురుషుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

లంచ్‌లో ఏం తినాలంటే..?

ఇక మ‌ధ్యాహ్న భోజ‌నంలో బీట్ రూట్, ఫైన్ గింజ‌లతో పాటు ఇత‌ర ఆహార ప‌దార్థాలు ఉండేలా చూసుకోవాలి. బీట్‌రూట్‌లో నైట్రేట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శ‌రీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా ఉపయోగపడతాయి. అలాగే కలయికకు అవసరమైన శక్తిని అందించడంలోనూ బీట్‌రూట్ చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. పైన్ గింజలు కూడా లంచ్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. వీటిలో జింక్ పుష్కలంగా ఉంటుందని, ఇది మగవారిలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

డిన్న‌ర్‌లో ఏం తినాలంటే..?

ఇక డిన్నర్‌లోనూ కలయిక‌కు ఉపయోగపడే హార్మోన్లను ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పొటాషియం ఎక్కువ‌గా ఉన్న ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవాలి. క్వినోవా, స్వీట్ పొటాటో, చిలకడ దుంపలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి డిన్నర్‌లో వీటిని మిస్‌ అవ్వొద్దు. వీటితో పాటు ఆపిల్స్, జీడిప‌ప్పు, అర‌టిపండ్లు కూడా డైట్‌లో చేర్చుకోవ‌చ్చు. అయితే చ‌క్కెర ఎక్కువ‌గా ఉన్న ప‌దార్థాల‌ను దూరంగా పెట్టాలి. ఈ ప‌దార్థాలు తిన‌డం వ‌ల్ల శృంగార జీవితానికి ఆటంకం క‌లిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.