Covid | 24 గంటల్లో 40 శాతం పెరిగిన కొవిడ్ కేసులు
దేశంలో 13,509 యాక్టివ్ కేసులు ఆరు నెలల్లో ఇదే గరిష్ఠ సంఖ్య విధాత : దేశంలో కరోనా (Covid) కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. గత 24 గంటల్లో 3016 కేసులో రికార్డయినట్టు గురువారం ఉదయం బులెటిన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అందులోనూ.. 24 గంటల వ్యవధిలో 40శాతం పెరుగుదల ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. అంతేకాదు.. ఆరు నెలల వ్యవధిలో ఇదే గరిష్ఠ స్థాయి. గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన 3,375 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో […]

- దేశంలో 13,509 యాక్టివ్ కేసులు
- ఆరు నెలల్లో ఇదే గరిష్ఠ సంఖ్య
విధాత : దేశంలో కరోనా (Covid) కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. గత 24 గంటల్లో 3016 కేసులో రికార్డయినట్టు గురువారం ఉదయం బులెటిన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అందులోనూ.. 24 గంటల వ్యవధిలో 40శాతం పెరుగుదల ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. అంతేకాదు.. ఆరు నెలల వ్యవధిలో ఇదే గరిష్ఠ స్థాయి. గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన 3,375 కేసులు నమోదయ్యాయి.
తాజా కేసులతో కలుపుకొని దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 13,509కి పెరిగింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌తో 14 మంది చనిపోయారు. ఇందులో మూడు మరణాలు మహారాష్ట్రలో నమోదుకాగా, ఢిల్లీలో ఇద్దరు, హిమాచల్‌ప్రదేశ్‌లో ఒకరు చనిపోయారు. కేరళలో 8 మంది చనిపోయినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కొవిడ్‌తో దేశంలో ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య 5,30,862కు చేరింది.
మొత్తం నాలుగున్నర కోట్ల కేసులు
కరోనా దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకూ 4,41,68,321 కేసులు నమోదయ్యాయి. మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నది.దాదాపు 200 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను దేశ ప్రజలకు అందించారు.
ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్
దేశ రాజధానిలో బుధవారం ఒక్కరోజే 300 తాజా కొవిడ్ కేసులు నమోదవడంతో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి గురువారం అత్యవసర సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.