ఎండాకాలంలో చల్లని నీళ్లు తాగుతున్నారా..? జర జాగ్రత్త..!
రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వడగాలులు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతుండటంతో శరీరం డీహైడ్రేట్‌కు గురవుతోంది. దీంతో ఎప్పటికప్పుడు చల్లని నీళ్లు, నిమ్మరసం, ఇతర శీతల పానీయాలు తీసుకుంటున్నారు. ఫ్రిజ్‌లో పెట్టిన నీళ్లను తాగుతున్నారు. ఇలా చల్లని నీళ్లను తాగడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వడగాలులు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతుండటంతో శరీరం డీహైడ్రేట్‌కు గురవుతోంది. దీంతో ఎప్పటికప్పుడు చల్లని నీళ్లు, నిమ్మరసం, ఇతర శీతల పానీయాలు తీసుకుంటున్నారు. ఫ్రిజ్‌లో పెట్టిన నీళ్లను తాగుతున్నారు. ఇలా చల్లని నీళ్లను తాగడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కంటిన్యూగా కూల్ వాటర్ తాగితే కొత్త సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. మరి సమ్మర్‌లో కూల్ వాటర్ తాగితే జరిగే నష్టాలు ఏవో తెలుసుకుందాం..
గొంతు సమస్యలు
కూల్ వాటర్ తాగడం వల్ల ప్రధానంగా గొంతు సమస్యలు వస్తాయి. గొంతు నొప్పి రావడం, ముక్కు కారడం వంటి సమస్యలు ఏర్పడుతాయి. శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. కాబట్టి చల్లటి నీళ్లు తాగకపోవడమే మంచిది.
గుండె సమస్యలు..
దాహం వేస్తుందని చెప్పి అదే పనిగా చల్లటి నీళ్లు తాగితే గుండెకు ముప్పు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కూల్ వాటర్ తాగడం వల్ల హార్ట్ రేట్ తగ్గిపోతోందని పలు పరిశోధనల్లో తేలిందని వైద్యులు సూచిస్తున్నారు. నాడీ వ్యవస్థ కూడా సరిగా పని చేయదంటున్నారు. దాంతో హార్ట్ రేట్ కూడా తగ్గిపోయి గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది.
జీర్ణ సమస్యలు
చల్లటి నీళ్లు తాగడం వల్ల తిన్న ఆహారం కూడా సరిగ్గా అరగదు. చల్లటి నీళ్లు పొట్టలో ఉండి.. ఆహారం అరగకుండా అడ్డుకుంటుంది. కడుపులో ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా మార్పు రావడం వల్ల కూడా ఆహారం అరగదు. అంతేకాకుండా ఫుడ్ ప్రాసెస్ చేయడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయి.
దంత సమస్యలు..
చల్లటి నీళ్లు పళ్లలోని నరాలపై ప్రభావం చూపిస్తాయి. దాని వల్ల పన్ను నొప్పి వస్తుంది. పంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే, తక్కువ కూలింగ్ ఉన్న నీళ్లను తాగాలి. అంతేకాకుండా నొప్పి ఎక్కువ అయితే, కచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఫ్రిజ్‌లో ఉంచిన వాటర్ కంటే కుండ నీళ్లు, మజ్జిగ లాంటివి తాగితే మంచిదని అంటున్నారు. పుచ్చకాయ, ఐస్ లేకుండా జ్యూస్, మజ్జిగ లాంటివి తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేటెడ్‌గా ఉంటుందని, ఎండ దెబ్బ తగలకుండా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.