Potato | ఉడికించిన బంగాళదుంపను మళ్లీ వేడి చేస్తున్నారా..? ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే..!
Potato | సీజన్ ఏదైనా బంగాళదుంపలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఎక్కువగా వినియోగించే కూరగాయల్లో బంగాళదుంప ముందువరుసలో ఉంటుంది. దీన్ని కూరగాయల్లో రారాజుగా పిలుస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బంగాళదుంపలను ఇష్టంగా తింటుంటారు. కానీ, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బంగాళదుంప చాలా సందర్భాల్లో ఆరోగ్యానికి హాని చేస్తుంది. బంగాళదుంప తినే ముందు ఒక విషయాన్ని అందరూ బాగా గుర్తుంచుకోవాలి. బంగాళాదుంపను ఎక్కువ సేపు ఫ్రిజ్లో ఉంచిన తర్వాత మళ్లీ వేడి చేసి తింటే ఆరోగ్యంపై చెడు […]

Potato | సీజన్ ఏదైనా బంగాళదుంపలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఎక్కువగా వినియోగించే కూరగాయల్లో బంగాళదుంప ముందువరుసలో ఉంటుంది. దీన్ని కూరగాయల్లో రారాజుగా పిలుస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బంగాళదుంపలను ఇష్టంగా తింటుంటారు. కానీ, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బంగాళదుంప చాలా సందర్భాల్లో ఆరోగ్యానికి హాని చేస్తుంది. బంగాళదుంప తినే ముందు ఒక విషయాన్ని అందరూ బాగా గుర్తుంచుకోవాలి. బంగాళాదుంపను ఎక్కువ సేపు ఫ్రిజ్లో ఉంచిన తర్వాత మళ్లీ వేడి చేసి తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ఉడికించిన బంగాళదుంపలను ఎక్కువ సేపు ఫ్రిజ్లో ఉంచిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ మళ్లీ ఉపయోగించకూడదు. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
వండే సమయంలో ఇది మరిచిపోవద్దు..
ఫ్రిజ్లో ఉంచి బంగాళదుంప మళ్లీ తీసుకుంటే ఆసుపత్రికి పాలుకాక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే దుంపల్లో ఉండే చక్కెర అమైనో ఆమ్లాలు.. ఆస్పరాజిన్ అనే రసాయనాలను తయారుచేస్తాయి. ఈ విషయం మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. సాధారణంగా ఈ రసాయనాన్ని ప్లాస్టిక్, పేపర్ తయారీలో వినియోగిస్తుంటారు. బంగాళాదుంపను ఎక్కువసేపు ఉడకబెట్టిన తర్వాత, దాంట్లో ఉండే పిండిపదార్థం చక్కెరగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో ఓ వ్యక్తి డయాబెటిస్ సమస్యతో బాధపడుతుంటే.. అతను మరిన్ని సమస్యలు ఎదురవుతాయని గుర్తుంచుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగాళదుంపలను వండే సమయంలో ఎక్కువ వేడిని ఉపయోగించకూడదని నిపుణులు సూచించారు.
ఈ సమస్యలు తప్పవు..!
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉడికించిన బంగాళదుంపలను ఫ్రిజ్లో ఉంచిన సమయంలో వాటిలోని పిండి పదార్థం చక్కెరగా మారుతుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరించారు. ఉడికించిన బంగాళదుంపను మళ్లీ వేడి చేస్తే వాటిలో ఉండే పోషకాలు ప్రమాదకరమైన మూలకాలుగా మారుతాయని పేర్కొన్నారు. ఫ్రిజ్లో ఉంచిన ఉడికించిన బంగాళదుంపలను మళ్లీ వేడి చేసినా, వేయిస్తే దుంపల్లో ఉండే అమినో యాసిడ్.. ఆస్పరాజిన్తో కలిసిపోయి అక్రిలమైడ్ అనే రసాయనాన్ని తయారు చేస్తుందని, ఇది ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపుతుందని హెచ్చరించారు.