నోటి దుర్వాసనతో ఇబ్బందిపడుతున్నారా..? ఈ చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టండి..!
Bad Breath | నోటి దుర్వాసన మానసిక స్థితిని పాడు చేయడంతో పాటు మీ పక్కనున్న వారిని సైతం ఇబ్బందులకు గురి చేస్తుంది. దీంతో ఎవరితో మాట్లాడాలన్నా ఇబ్బందిపడుతుంటారు. కొందరు బ్రష్ చేసిన తర్వాత కూడా ఈ సమస్య ఉంటుంది. దీనికి అనేక కారణాలుంటాయి. సరిగా బ్రష్ చేయకపోవడం.. తీసుకున్న ఆహారం, కూల్‌డ్రింక్స్, కడుపు సంబంధిత వ్యాధులు సైతం నోటి దుర్వాసనకు కారణమవుతాయి. అంతే కాకుండా దీర్ఘకాలంగా ఏదైనా వ్యాధికి మందులు వాడుతున్న వారికి నోటి దుర్వాసన […]

Bad Breath | నోటి దుర్వాసన మానసిక స్థితిని పాడు చేయడంతో పాటు మీ పక్కనున్న వారిని సైతం ఇబ్బందులకు గురి చేస్తుంది. దీంతో ఎవరితో మాట్లాడాలన్నా ఇబ్బందిపడుతుంటారు. కొందరు బ్రష్ చేసిన తర్వాత కూడా ఈ సమస్య ఉంటుంది. దీనికి అనేక కారణాలుంటాయి. సరిగా బ్రష్ చేయకపోవడం.. తీసుకున్న ఆహారం, కూల్‌డ్రింక్స్, కడుపు సంబంధిత వ్యాధులు సైతం నోటి దుర్వాసనకు కారణమవుతాయి. అంతే కాకుండా దీర్ఘకాలంగా ఏదైనా వ్యాధికి మందులు వాడుతున్న వారికి నోటి దుర్వాసన ఇబ్బందిపెడుతుంది. అయితే, కొన్ని చిట్కాలను పాటించి ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అవేంటో ఓసారి తెలుసుకుందాం రండి..
లవంగాలు..
చాలా సార్లు బ్రష్ చేసిన తర్వాత కూడా మీ నోటి వాసన వస్తున్నట్లయితే లవంగాలను నోట్లో వేసుకోవాలి. రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. ఇవి బ్యాక్టీరియాను నిర్మూలించడంలో సహాయపడుతాయి. సమస్య నుంచి వేగంగా బయటపడాలని ఎక్కువ మొత్తంలో ఎప్పుడూ తినకూడదు. మితిమీరితే ఇవి కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని గుర్తుంచుకోవాలి.
సోంపు..
ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే సోంపు తీసుకోండి. ఈ సోంపులో కూలింగ్ ఏజెంట్ ఉంటుంది. ఇది కడుపుని చల్లగా ఉంచుతుంది. తద్వారా నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. అలాగే సోంపును తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు సైతం దూరమవుతాయి.
తులసి
తులసి అనేక వ్యాధులను దూరం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గమ్ నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. ఒకటి రెండు ఆకులను నీటితో కలిసి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఆవాల నూనె
ఆవనూనెలో కొద్దిగా ఉప్పు వేసి వేలితో చిగుళ్లకు మర్దన చేస్తే చిగుళ్లు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో నోటి దుర్వాసన సైతం దూరమవుతుంది. దీంతో పాటు నోటి దుర్వాసనను పోగొట్టుకునేందుకు ఉప్పు నీటితో పుక్కిలించినా ఫలితం ఉంటుంది. నీటిలో టీస్పూన్ ఉప్పు కలిపుకోవాలి. తర్వాత ఈ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఐదు నుంచి ఆరుసార్లు గార్లింగ్ చేయాలి.