Health tips | ఏం లాభమో తెలిస్తే ఈ కాలా గాజర్‌ను తినకుండా అస్సలు ఉండలేరు..!
Health tips : క్యారెట్‌లు సాధారణంగా ఎరుపు, కాషాయం రంగులో ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఒక రకం క్యారెట్‌లు మాత్రం నల్లగా ఉంటాయి. ఈ నల్ల క్యారెట్‌లను చాలామంది చూసి ఉండరు. ఇవి చాలా తక్కువగా కనిపిస్తాయి. వీటినే కాలా గాజర్‌లు అంటారు. ఈ కాలా గాజర్‌లు కొన్ని బాగా నల్లగా, కొన్ని మాత్రం బీట్‌రూట్ రంగులో కనిపిస్తాయి. అయితే సాధారణ క్యారెట్‌లతో పోల్చితే ఈ నల్ల క్యారెట్‌లతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు.

Health tips : క్యారెట్లు సాధారణంగా ఎరుపు, కాషాయం రంగులో ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఒక రకం క్యారెట్‌లు మాత్రం నల్లగా ఉంటాయి. ఈ నల్ల క్యారెట్‌లను చాలామంది చూసి ఉండరు. ఇవి చాలా తక్కువగా కనిపిస్తాయి. వీటినే కాలా గాజర్‌లు అంటారు. ఈ కాలా గాజర్‌లు కొన్ని బాగా నల్లగా, కొన్ని మాత్రం బీట్‌రూట్ రంగులో కనిపిస్తాయి. అయితే సాధారణ క్యారెట్‌లతో పోల్చితే ఈ నల్ల క్యారెట్‌లతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. అయితే రుచికి మాత్రం ఇవి అంతతీయగా ఉండవు. మరి ఈ నల్ల క్యారెట్‌లతో కలిగే ఆ ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం..
ప్రయోజనాలు ఇవే..
- నల్ల క్యారెట్లలో ఆంథోసయనిన్ అనే పదార్థం ఉండటంవల్ల వాటికి ఆ రంగు వస్తుంది. ఈ ఆంథోసయనినే మన శరీరానికి క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తిని ఇస్తుంది.
- సాధారణ క్యారెట్లలో మాదిరిగానే నల్ల క్యారెట్‌లలోనూ బీటాకెరాటిన్ ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. కంటి కణాలకు రక్షణ కల్పిస్తుంది.
- నల్ల క్యారెట్‌లలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. అందువల్ల ఇవి ఆరోగ్యవంతమైన జీర్ణక్రియకు తోడ్పడుతాయి. నల్ల క్యారెట్లు తినడంవల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవ్వడమేగాక ఒంట్లో కొవ్వు కూడా తగ్గుతుంది.
- వయసు మళ్లిన వారిలో చాలామందిని రుమటాయిడ్ ఆర్ధరైటిస్ సమస్య వేధిస్తుంటుంది. నల్ల క్యారెట్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటి ఆక్సిడెంట్ గుణాలు ఈ సమస్యకు మంచి పరిష్కారం చూపుతాయి.
- కొంతమందిలో వయసుతోపాటే మతిమరుపు సమస్య పెరుగుతుంది. అలాంటివారు నల్ల క్యారెట్లను తినడం అలవాటు చేసుకుంటే పరిష్కారం లభిస్తుంది. నల్ల క్యారెట్లు అల్జీమర్స్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి.
- గమనిక : అయితే ఈ నల్ల క్యారెట్‌లను అతిగా తింటే అలర్జీలు, రక్తపోటులో హెచ్చుతగ్గుల లాంటి సమస్యలు వస్తాయి. రోజుకి ఒకటి, రెండు క్యారెట్లకు మించకుండా తింటే మాత్రం ఏ సమస్యా ఉండదు.