జ‌న‌వ‌రి 18 నుంచి కంటి వెలుగు: సీఎం కేసీఆర్‌

విధాత: రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 18 తారీకు నుంచి.. కంటి వెలుగు కార్యక్రమాన్నినిర్వహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. గురువారం మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు, వైద్య‌శాఖ ఉన్న‌తాధికారుల‌తో నిర్వ‌హించిన ఉన్నత స్థాయి స‌మీక్ష స‌మావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌జ‌లు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకునేలా అధికారులు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయాల‌న్నారు. అలాగే కంటి వెలుగు కార్యక్రమం అమలు తీరు, ప్రజారోగ్యం, వైద్యం త‌దిత‌ర అంశాలపై చ‌ర్చించారు. స‌మీక్ష‌లో వైద్య […]

  • By: krs    health    Nov 17, 2022 12:28 PM IST
జ‌న‌వ‌రి 18 నుంచి కంటి వెలుగు: సీఎం కేసీఆర్‌

విధాత: రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 18 తారీకు నుంచి.. కంటి వెలుగు కార్యక్రమాన్నినిర్వహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. గురువారం మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు, వైద్య‌శాఖ ఉన్న‌తాధికారుల‌తో నిర్వ‌హించిన ఉన్నత స్థాయి స‌మీక్ష స‌మావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌జ‌లు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకునేలా అధికారులు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయాల‌న్నారు. అలాగే కంటి వెలుగు కార్యక్రమం అమలు తీరు, ప్రజారోగ్యం, వైద్యం త‌దిత‌ర అంశాలపై చ‌ర్చించారు. స‌మీక్ష‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, ఇతర శాఖల మంత్రులు, ప్రజాప్రతినిధులు, వైద్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

2018లో ప్రారంభం

కంటి వెలుగు పథకాన్ని 2018, ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం విదిత‌మే. ఈ పథకం ఐదు నెలల పాటు విజ‌య‌వంతంగా కొనసాగింది. కంటి వెలుగు కోసం ప్రభుత్వం రూ.106 కోట్లు ఖర్చు చేసింది కూడా. ఈ పథకంలో భాగంగా కంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ ప‌డుతున్న వారికి కళ్లద్దాలతో పాటు మందుల‌ను ప్ర‌భుత్వం పంపిణీ చేసింది.

అయితే కంటి ఆపరేషన్లు మాత్రం పూర్తి స్థాయిలో చేయలేదన్న వాదన ప్రజల నుంచి బాగా వినిపించింది. తెలంగాణలోని ప్ర‌తి జిల్లాల్లో కంటి సమస్యలతో సతమతమవుతున్న వాళ్ల సంఖ్య‌ భారీగానే ఉంది. చాలా మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు.

ఆప‌రేష‌న్ల‌కు కూడా భారీగా త‌ర‌లివ‌స్తున్న‌ట్లు ప్ర‌భుత్వానికి స‌మాచారం అందింది. దీంతో ఇదే విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వైద్యశాఖ అధికారులు ఇచ్చిన రిపోర్టులను పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్.. తెలంగాణలో మళ్లీ కంటి వెలుగు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.