శానిటరీ ప్యాడ్స్ హానికరం!
విధాత: ఢిల్లీకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో మహిళలు వినియోగిస్తున్న శానిటరీ ప్యాడ్స్ హానికరమైనవని తేలటం దిగ్భ్రాంతి కరమైనది. వాటి తయారీలో వినియోగిస్తున్న ప్లాస్టిక్ పదార్థాలు, ఇతర రసాయనాలు మహిళలకు దీర్ఘకాలంలో తీవ్రహాని కలుగజేస్తాయని ఆ అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో విరివిగా వాడుతున్న పదిరకాల ప్రముఖ బ్రాండ్ల సానిటరీ ప్యాడ్లన్నీ హానికరమైనవే కావటం ఆందోళన కరం. ఇదిలా ఉంటే.. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని […]

విధాత: ఢిల్లీకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో మహిళలు వినియోగిస్తున్న శానిటరీ ప్యాడ్స్ హానికరమైనవని తేలటం దిగ్భ్రాంతి కరమైనది. వాటి తయారీలో వినియోగిస్తున్న ప్లాస్టిక్ పదార్థాలు, ఇతర రసాయనాలు మహిళలకు దీర్ఘకాలంలో తీవ్రహాని కలుగజేస్తాయని ఆ అధ్యయనంలో వెల్లడైంది.
దేశంలో విరివిగా వాడుతున్న పదిరకాల ప్రముఖ బ్రాండ్ల సానిటరీ ప్యాడ్లన్నీ హానికరమైనవే కావటం ఆందోళన కరం. ఇదిలా ఉంటే.. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని శానిటరీ ప్యాడ్ల పంపకాన్ని కూడా చేపట్టింది.
ఈ అధ్యయనంలో వెలుగు చూసిన విషయాలను దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవటమో, ప్రత్యామ్నాయ శానిటరీ ప్యాడ్ల కోసం ఆలోచించటమో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.