లండ‌న్ దీపావ‌ళి వేడుక‌ల్లో విషాదం

లండన్ దీపావళి వేడుకల్లో విషాదం చోటుచేసుకున్న‌ది. పండుగ‌పూట సంభ‌వించిన అగ్నిప్రమాదంలో భారతీయ సంతతి కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు.

లండ‌న్ దీపావ‌ళి వేడుక‌ల్లో విషాదం
  • అగ్ని ప్ర‌మాదంలో భార‌త సంత‌తి కుటుంబం మృతి
  • ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు దుర్మ‌ర‌ణం


విధాత‌: లండన్ దీపావళి వేడుకల్లో విషాదం చోటుచేసుకున్న‌ది. పండుగ‌పూట సంభ‌వించిన అగ్నిప్రమాదంలో భారతీయ సంతతి కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. పశ్చిమ లండన్‌లోని ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురి స‌భ్యుల భారతీయ సంతతి కుటుంబం మరణించింది. ఈ ఘటనపై మెట్రోపాలిటన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


బాధితులు ఎవ‌రు అనేది పోలీసులు వెల్ల‌డించ‌న‌ప్ప‌టికీ భారతీయ వారసత్వానికి చెందిన కుటుంబమని తెలిపారు. ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరగడానికి ముందు దీపావళి జరుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. కాలిన గాయాల‌తో మ‌రొక‌రు ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్న‌ట్టు వెల్ల‌డించారు. ముందుజాగ్రత్తగా చుట్టుపక్కల ఉన్న ఇంట్ల‌లోని వారిని ఖాళీ చేయించామని, అగ్నిప్రమాదానికి గల కారణాలపై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు