social media । పిల్లలకు సామాజిక మాధ్యమాల నిషేధం.. అద్భుత నిర్ణయం ఎక్కడంటే..

చిన్న వయసులోనే సామాజిక మాధ్యమాల ప్రభావానికి గురవుతున్న చిన్నారులను రక్షించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పదహారేళ్లలోపు చిన్నారులను సామాజిక మాధ్యమాల వినియోగానికి దూరంగా ఉంచనున్నట్టు ప్రకటించింది.

social media ।  పిల్లలకు సామాజిక మాధ్యమాల నిషేధం.. అద్భుత నిర్ణయం ఎక్కడంటే..

social media । సోషల్‌ మీడియా! ఇప్పుడు చిన్నారులకు సైతం అందుబాటు ఉంటున్న మాధ్యమం! పిల్లల  (children) చదువులపై తీవ్ర ప్రభావం (severe impact) చూపించడమే కాకుండా.. అవాంఛిత కంటెంట్‌కు (unwanted content) వారిని తప్పదోవలో చేరువు చేస్తున్న ఈ గాడ్జెట్‌ భూతంపై ప్రపంచవ్యాప్తంగా అనేక ఆందోళనలు ఉన్నాయి. చిన్న వయసులోనే సామాజిక మాధ్యమాల్లో భాగస్వాములవుతున్న చిన్నారులూ ఉన్నారు. ఇటువంటి అవాంఛనీయ ధోరణికి అడ్డుకట్ట వేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం (Australian government) నిర్ణయించింది. ఇందుకోసం సామాజిక మాధ్యమాల వినియోగానికి కనీస వయోపరిమితిని తీసుకురావాలని యోచిస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్‌  (Anthony Albanese) ప్రకటించారు. కనీసం పదహారు ఏళ్లు దాటినవారు మాత్రమే సామాజిక మాధ్యమాలకు అర్హులుగా చేయనున్నట్టు తెలిపారు. పదహారేళ్లలోపు (age of sixteen) చిన్నారులను సామాజిక మాధ్యమాలకు దూరంగా (away from social media) ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు అల్బనీస్‌ తెలిపారు.

పిల్లల్లో సామాజిక మాధ్యమాల వినియోగాన్ని నియంత్రించడం, వారిని ఆటల(games)తోపాటు ఇతర శారీరక కార్యక్రమాల(physical activities) వైపు మళ్లించడం లక్ష్యంగా ఈ చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. పిల్లల్లో ఫోన్ల వినియోగం పెరగడాన్ని తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుంది. సామాజిక మాధ్యమాలు పిల్లల పాలిట ఉపద్రవంగా (nuisance) మారాయని, తక్షణం దీనికి అడ్డుకట్టవేయాల్సి ఉందని అల్బనీస్‌ అన్నారు. ఫేస్‌బుక్‌ (Facebook), ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram), టిక్‌టాక్‌  (TikTok) వంటి వాటి వినియోగానికి కనీస వయోపరిమితిపై ఇంకా తుది నిర్ణయం చేయనప్పటికీ, 14 లేక 16 ఏళ్లు కనీస వయోపరిమితిగా పెట్టే అవకాశం ఉంది. ఈ వయోపరిమితి 16 ఏళ్లు ఉండాలని అల్బనీస్‌ ప్రతిపాదిస్తున్నారు.

సామాజిక మాధ్యమాల కంపెనీలు తమ ప్లాట్‌ ఫామ్స్‌ పోషిస్తున్న పాత్ర విషయంలో బాధ్యత (responsibility) తీసుకోవడం లేదని, యువతరంపై అవి కలిగిస్తున్న ప్రభావాలకు సంబంధించిన సామాజిక మాధ్యమాల కంపెనీలు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన అన్నారు. సామాజిక మాధ్యమ కంపెనీలు తాము అన్నింటికీ అతీతులం అనుకుంటున్నారని రేడియో ఇంటర్‌వ్యూలో ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు పీటర్‌ డట్టన్‌ (Peter Dutton) కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు ప్రకటించారు. సామాజిక మాధ్యమాలు బాధ్యతగా వ్యవహరించేట్టు చేస్తామని అల్బనీస్‌ అన్నారు. సామాజిక మాధ్యమాల్లోకి ప్రవేశించేవారి వయస్సును గుర్తించి నియంత్రించే ప్రయత్నాలు త్వరలోనే మొదలు పెడతామని ఆయన అన్నారు. ఇదే తరహా ప్రయత్నాలు అన్ని దేశాల్లోనూ జరగాలని పరిశీలకులు అంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న వయసులోనే ప్రవేశిస్తున్న పిల్లలు తప్పుదోవ పట్టే అవకాశాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. ఏదైనా ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.