Beautiful Biker | అత్యంత అందగత్తె అయిన ఆ లేడీ బైకర్ ఇక లేదు.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం..!
Beautiful Biker | ప్రపంచంలోనే అత్యంత అందగత్తె అయిన లేడీ బైకర్ టాట్యానా ఓజోలినా (Tatyana Ozolina) దుర్మరణం పాలయ్యారు. ఆమె తాను నడుపుతున్న మోటార్ సైకిల్‌పై నియంత్రణ కోల్పోయి టర్కీలోని మిలాస్ సమీపంలో ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Beautiful Biker : ప్రపంచంలోనే అత్యంత అందగత్తె అయిన లేడీ బైకర్ టాట్యానా ఓజోలినా (Tatyana Ozolina) దుర్మరణం పాలయ్యారు. ఆమె తాను నడుపుతున్న మోటార్ సైకిల్‌పై నియంత్రణ కోల్పోయి టర్కీలోని మిలాస్ సమీపంలో ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. టాట్యానా ఓజోలినా అందానికి, బైక్ రైడింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. తనదైన అందం, మోటార్ సైకిళ్లపై అభిరుచితో ఆమె నిరంతరం వార్తల్లో వ్యక్తిగా మారారు.
రష్యన్ పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన జోజోలినా టర్కీలో విహారయాత్రలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. టర్కీలోని ముగ్లా బోడ్రమ్ మధ్య తన ఎరుపు రంగు BMW మోటార్‌బైక్‌ను నడుపుతుండగా ప్రమాదం జరిగింది. 38 ఏళ్ల ఓజోలినా తన మోటార్‌సైకిల్‌పై నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాద సమయంలోఓ బైక్‌పైనే ఉన్న టర్కిష్ బైకర్ ఒనూర్ ఒబుట్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మరో బైకర్ ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా ఉన్నాడు.
ఓజోలినా చివరి సోషల్ మీడియా వీడియోలో.. రష్యాతో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా తనకు యూరోపియన్ యూనియన్‌లో ప్రవేశం నిరాకరించడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఓజోలినా కిక్‌స్టార్టర్ ద్వారా 2023లో మోటోబ్లాగర్ ఆఫ్ ది ఇయర్‌గా, ట్రావెల్ బ్లాగర్ ఆఫ్ ది ఇయర్‌గా ఓజోలినా గౌరవం దక్కించుకున్నారు. కాగా టాట్యానా చివరి సోషల్ మీడియా పోస్ట్ అభిమానుల హృదయాలను కదిలిస్తున్నది.