బీపీ లెక్క మారిందండోయ్ 120/80 కాదు.. 140/90
విధాత: సైలెంట్ కిల్లర్‌గా పేరొందిన అధిక రక్తపోటుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ సవరించింది. ప్రస్తుతం ఉన్న ప్రమాణాల ప్రకారం సిస్టోలిక్ పోటు (హృదయ సంకోచ సమయంలో.. అంటే గుండె కొట్టుకున్నప్పుడు) 120ఎంఎంహెచ్‌జీ, డయస్టాలిక్ పోటు (హృదయం వ్యాకోచించినప్పుడు) 80 ఎంఎంహెచ్‌జీలోపు ఉండాలి. సిస్టోలిక్ పోటు 130కి చేరితే.. డయస్టాలిక్‌పోటు 80 దాటితే జాగ్రత్తపడాలని, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని, ఉప్పు తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా బీపీ ప్రమాణాలకు సంబంధించిన […]

విధాత: సైలెంట్ కిల్లర్‌గా పేరొందిన అధిక రక్తపోటుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ సవరించింది. ప్రస్తుతం ఉన్న ప్రమాణాల ప్రకారం సిస్టోలిక్ పోటు (హృదయ సంకోచ సమయంలో.. అంటే గుండె కొట్టుకున్నప్పుడు) 120ఎంఎంహెచ్‌జీ, డయస్టాలిక్ పోటు (హృదయం వ్యాకోచించినప్పుడు) 80 ఎంఎంహెచ్‌జీలోపు ఉండాలి. సిస్టోలిక్ పోటు 130కి చేరితే.. డయస్టాలిక్‌పోటు 80 దాటితే జాగ్రత్తపడాలని, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని, ఉప్పు తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా బీపీ ప్రమాణాలకు సంబంధించిన మార్గదర్శకాలను సవరించింది. సాధారణ ఆరోగ్యవంతులకు సిస్టోలిక్ పోటు 140ఎంఎంహెచ్‌జీ, అంతకు మించి.. డయస్టాలిక్ పోటును 90ఎంఎంహెచ్‌జీ, అంతకు మించి వరుసగా 2 రోజులపాటు ఉంటే దాన్ని అధిక రక్తపోటుగా పరిగణించాలని పేర్కొంది. రిస్క్ ఫ్యాక్టర్స్.. అంటే పొగ తాగే అలవాటు, మద్యపానం, కష్టపడకుండా ఒకే చోట కూర్చుని పనిచేయడం, రోజుకు అరగంటైనా వ్యాయామం చేయకపోవడం, వంశపారంపర్యంగా బీపీ వచ్చే అవకాశం వంటివి ఉన్నవారికి, హృద్రోగులకు సిస్టోలిక్ పోటు గరిష్ఠంగా 130 దాకా ఉండొచ్చని పేర్కొంది. సవరించిన మార్గదర్శకాలు అధికరక్తపోటు ఔషధాల పరిశ్రమపై పెనుప్రభావం చూపుతాయంటే అతిశయోక్తి కాదు