గూగూల్ పై కాపీరైట్..రూ.4,415 కోట్లు ఫైన్‌

విధాత‌: ఈయూ కాపీరైట్స్‌ నిబంధనల ప్రకారం.. స్థానిక మీడియా హౌజ్‌ల కంటెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా గూగుల్‌న్యూస్‌ వాడుకుంటోందని పేర్కొంటూ 500 మిలియన్‌ యూరోలను ఫైన్‌ విధించింది ఫ్రాన్స్‌ కాంపిటీషన్‌ రెగ్యులేటర్‌. మన కరెన్సీలో ఆ జరిమానా విలువ రూ.4,415 కోట్లకు పైనే. గూగుల్‌ న్యూస్‌లో తమ వెబ్‌సైట్లకు చెందిన కంటెంట్‌ను అనుమతి లేకుండా చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొన్ని న్యూస్‌ ఏజెన్సీలు గతంలో ఫ్రాన్స్‌ కాంపిటీషన్‌ రెగ్యులేటర్‌ను ఆశ్రయించాయి. ఈ మేరకు మీడియా హౌజ్‌లతో సంప్రదింపులు […]

గూగూల్ పై కాపీరైట్..రూ.4,415 కోట్లు ఫైన్‌

విధాత‌: ఈయూ కాపీరైట్స్‌ నిబంధనల ప్రకారం.. స్థానిక మీడియా హౌజ్‌ల కంటెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా గూగుల్‌న్యూస్‌ వాడుకుంటోందని పేర్కొంటూ 500 మిలియన్‌ యూరోలను ఫైన్‌ విధించింది ఫ్రాన్స్‌ కాంపిటీషన్‌ రెగ్యులేటర్‌. మన కరెన్సీలో ఆ జరిమానా విలువ రూ.4,415 కోట్లకు పైనే.

గూగుల్‌ న్యూస్‌లో తమ వెబ్‌సైట్లకు చెందిన కంటెంట్‌ను అనుమతి లేకుండా చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొన్ని న్యూస్‌ ఏజెన్సీలు గతంలో ఫ్రాన్స్‌ కాంపిటీషన్‌ రెగ్యులేటర్‌ను ఆశ్రయించాయి. ఈ మేరకు మీడియా హౌజ్‌లతో సంప్రదింపులు జరపాలని గూగుల్‌కు తెలిపినప్పటికీ.. గూగుల్‌ నిర్లక్క్ష్యం వహించడంతో యాంటీట్రస్ట్‌ రెగ్యులేటర్స్‌ కింద ఇప్పుడు ఈ భారీ జరిమాను విధించింది. అంతేకాదు కాపీరైటెడ్‌ కంటెంట్‌ను వాడుకుంటున్నందుకు మీడియా పబ్లిషర్లకు రెమ్యునరేషన్‌ చెల్లించాలని, లేని పక్షంలో రోజుకు 9 లక్షల యూరోలను అదనంగా ఏజెన్సీలకు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.