పాకిస్తాన్‌లో మత గురువు హత్య

పాకిస్తాన్‌లో ప్రముఖ మత గురువు మౌలానా రహీముల్లా తారీఖ్ సోమవారం ఉదయం 11.30 గంటలకు దారుణ హత్యకు గురయ్యాడు

పాకిస్తాన్‌లో మత గురువు హత్య

కరాచీ: పాకిస్తాన్‌లో ప్రముఖ మత గురువు మౌలానా రహీముల్లా తారీఖ్ సోమవారం ఉదయం 11.30 గంటలకు దారుణ హత్యకు గురయ్యాడు. మతపరమైన సమావేశానికి హాజరయ్యేందుకు మౌలానా తారీక్ వెళ్తుండగా గుర్తుతెలియని సాయుధులు ఆయనపై బుల్లెట్ల వర్షం కురిపించారు. కాల్పుల్లో తారీఖ్ ఘటన స్థలంలోనే మరణించాడు. అయితే మౌలానాను చంపడం వారి లక్ష్యం కాదని కరాచీ పోలీసులు చెబుతున్నారు. మృతుడు తారిఖ్‌ జైష్ మహమ్మద్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ హజార్ కు సన్నిహితుడని ప్రచారం జరుగుతుంది.


అయితే తారిఖ్‌కు జైష్ తో సంబంధం పై స్థానిక మీడియా కథనాలలో ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. ఇటీవల పాకిస్తాన్‌లో వరుసగా లక్షిత హత్యలు జరుగుతున్నాయి. అంతకుముందు ఖైబర్ లోని ఫఖ్తూన్ఖ్వా సీనియర్ కమాండర్ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమ్ ఖాన్ ఘాజిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. అతడు టెర్రరిస్ట్ ఆర్మీలో రిక్రూటర్ గా పనిచేసేవాడని పేర్కొన్నారు. అతను భారతదేశంలో చాందసవాదాన్ని ప్రోత్సహించడంలో నిమగ్నమై ఉన్నాడని, కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని సమాచారం.


పాకిస్తాన్ లో తరచుగా జరుగుతున్న టార్గెట్ హత్యల చుట్టూ ఉన్న పరిస్థితులు అస్పష్టంగా ఉన్నాయి. ఈ హత్యలకు ఏ సంస్థ బాధ్యత వహించలేదు. పాకిస్తాన్ సరిహద్దుల్లో కిడ్నాప్‌లు, హత్యలకు భారత నిఘా సంస్థలను నిందించడం గమనార్హం. భారత ఏజెన్సీలే ఈ హత్యలకు పాల్పడుతున్నాయని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పాకిస్తాన్ పేర్కొంది. అయితే ఏ సాక్షాలు లేని ఈ వాదనలను భారత్ స్పష్టంగా తోసిపుచ్చింది.


థండి ఉగ్ర దాడి సూత్రధారి రియాజ్ అలియాస్ అబూ ఖాసిం అక్రమిత కాశ్మీర్లోని మసీదులో కాల్చి చంపబడ్డాడు. మరో కేసులో ముజాహిద్దీన్ కమాండర్ బషీర్‌ అహమ్మద్ రావల్పిండిలోవ హత్యకు గురయ్యాడు. అతన్ని ఇంతియాజ్ ఆలం అని కూడా పిలుస్తారు. అయితే ఈ హత్యల వెనుక కారణాలు స్పష్టంగా తెలియ రాలేదు. ఈ విషయాలపై స్థానిక పోలీసులు కూడా వివరాలు వెల్లడించలేదు.