ఒమిక్రాన్ ఎఫెక్ట్: ప్రధాని మోడీ అత్యవసర సమీక్ష
విధాత : ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రధాని మోడీ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా పరిస్థితులను ఆరోగ్యశాఖ అధికారులు ప్రధానికి వివరించారు. ఒమిక్రాన్ వైరస్ భారతదేశంలో వ్యాపిస్తున్నదని కర్ణాటకకు చెందిన ఇద్దరికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు. ఇప్పటికే వచ్చిన కరోనా వైరస్ కంటే ఓమిక్రాన్ వైరస్ 5 రెట్లు వేగంగా వ్యాపిస్తున్నదని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం వెల్లడించిన నివారణ చర్యలను ప్రజలు ఉల్లంఘించకూడదనికొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం […]

విధాత : ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రధాని మోడీ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా పరిస్థితులను ఆరోగ్యశాఖ అధికారులు ప్రధానికి వివరించారు. ఒమిక్రాన్ వైరస్ భారతదేశంలో వ్యాపిస్తున్నదని కర్ణాటకకు చెందిన ఇద్దరికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు.
ఇప్పటికే వచ్చిన కరోనా వైరస్ కంటే ఓమిక్రాన్ వైరస్ 5 రెట్లు వేగంగా వ్యాపిస్తున్నదని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం వెల్లడించిన నివారణ చర్యలను ప్రజలు ఉల్లంఘించకూడదని
కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా కోరింది.
ఇదిలాఉండగా దక్షిణాఫ్రికాలో రోజురోజుకూ కేసులు రెట్టింపు అవుతుండగా క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ 24 దేశాలకు విస్తరించినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
రిస్క్ దేశాల నుంచి వచ్చిన 325 మంది విదేశీ ప్రయాణికులకు టెస్టులు నిర్వహించగా 35 ఏండ్ల మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా టిమ్స్ లో చికిత్స అందిస్తున్నామని జీనోమ్ సిక్వీన్స్ కి నమూనాలు పంపించామని ఫలితాలు రావడానికి
రెండు రోజుల సమయం పడుతుంది అధికారులు తెలిపారు.
సౌత్ ఆఫ్రికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగకపోవడం తోనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు.