Pak Army chief Asim Munir | సైనిక దుస్తుల్లో ఉన్న బిన్ లాడెన్: జనరల్ మునీర్‌పై అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి ఫైర్
పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ సైనిక దుస్తుల్లో ఉన్న ఒసామా బిన్ లాడెన్ అని అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి మైకేల్ రూబిన్ అభివర్ణించారు. సోమవారం ఎఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ పాకిస్తాన్ ఒక దుష్టరాజ్యంగా ప్రవర్తిస్తున్నదని విమర్శించారు. అమెరికా పర్యటన సందర్భంగా మునీర్ అణుయుద్ధం గురించి బెదిరింపులకు పాల్పడిన విషయాన్ని ప్రస్తావిస్తూ రూబిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Pak Army chief Asim Munir | పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ సైనిక దుస్తుల్లో ఉన్న ఒసామా బిన్ లాడెన్ అని అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి మైకేల్ రూబిన్ అభివర్ణించారు. సోమవారం ఎఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ పాకిస్తాన్ ఒక దుష్టరాజ్యంగా ప్రవర్తిస్తున్నదని విమర్శించారు. అమెరికా పర్యటన సందర్భంగా మునీర్ అణుయుద్ధం గురించి బెదిరింపులకు పాల్పడిన విషయాన్ని ప్రస్తావిస్తూ రూబిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. నాటోయేతర మిత్రపక్షదేశంగా పాకిస్తాన్‌కు ఇచ్చిన హోదాను ఉపసంహరించుకోవాలని రూబిన్ కోరారు.
అమెరికా గడ్డపైన పాకిస్తాన్ ఇటువంటి బెదిరింపులకు దిగడం ఎంతమాత్రం ఆమోదనీయం కాదు. ఫీల్డ్ మార్షల్ వ్యాఖ్యలు ఒసామా బిన్ లాడెన్‌ని గుర్తు చేస్తున్నాయి. ఎంత మేలు చేసినా, ఎన్ని రాయితీలు ఇచ్చినా ఆయన భావజాలాన్ని గానీ, ఆయనకు మద్దతు ఇస్తున్న పాకిస్తాన్ మేధో వర్గాన్ని గానీ మార్చలేము అని రూబిన్ అన్నారు. పాకిస్తాన్ అణ్వస్త్రాలు టెర్రరిస్టులను మరింత దుర్మార్గాలకు ప్రోత్సహిస్తాయని, అమెరికన్లు బాధితులనే కళ్లజోళ్ల నుంచి టెర్రరిస్టులను చూస్తున్నారని, మునీర్ సైనిక దుస్తుల్లో ఉన్న ఒసామా బిన్ లాడెన్ అని రూబిన్ అన్నారు.
ఫ్లారిడాలోని టాంపాలో సోమవారం మాట్లాడిన జనరల్ మునీర్.. భారత్, పాక్ మధ్య ఇటీవలి ఘర్షణ తర్వాత రెండోసారి అమెరికాలో పర్యటించిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్.. సింధు నదిపై భారత్ ఎలాంటి డ్యామ్ నిర్మించినా దాన్ని పేల్చివేస్తామని బెదిరించారు. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు చెందని కీలక రక్తనాళంగా అభివర్ణించారు. పాకిస్తాన్ అణు శక్తిని ప్రస్తావిస్తూ.. భారత్ కనుక తమపై దాడి చేస్తే సగం ప్రపంచాన్ని తమ వెంట తీసుకుపోతామని హెచ్చరికలు చేశారు.
ఇవి కూడా చదవండి..
Pakistan Army New Chief | అధ్యక్ష పదవిపై కన్నేసిన పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్?
ఆపరేషన్ సిందూర్‌లో పాక్ వైమానిక దళం కుదేలు