పాపం ఏనుగు.. ఈ స్థితిలో చూడాలంటేనే బాధ‌గా ఉంది (వీడియో)

విధాత‌: మాములుగా మ‌న‌కు చిన్న దెబ్బ త‌గిలితేనే విల‌విల‌లాడిపోతాం, మ‌నం పెంచుకునే కుక్క‌పిల్ల‌, పిల్లి పిల్ల‌ల‌కు గాయాలైతే క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా ద‌వాఖాన‌ల‌కు ప‌రుగెత్తుతాం. అలాంటిది ప్ర‌పంచంలోనే పెద్ద జంతువు, భారీ కాయం క‌లిగిన ఏనుగుకు గాయమైతే ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఒక్క‌సారి ఊహించండి. వ‌ర్ణణాతీతం కావాలంటె ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది. గురువారం ఉదయం కేర‌ళ రాష్ట్రం పాలక్కాడ్ జిల్లా వ‌ళయార్ వ‌ద్ద‌ కోయంబత్తూరు నుంచి మంగళూరు వెళ్తున్న ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్ ఏనుగును […]

పాపం ఏనుగు.. ఈ స్థితిలో చూడాలంటేనే బాధ‌గా ఉంది (వీడియో)

విధాత‌: మాములుగా మ‌న‌కు చిన్న దెబ్బ త‌గిలితేనే విల‌విల‌లాడిపోతాం, మ‌నం పెంచుకునే కుక్క‌పిల్ల‌, పిల్లి పిల్ల‌ల‌కు గాయాలైతే క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా ద‌వాఖాన‌ల‌కు ప‌రుగెత్తుతాం. అలాంటిది ప్ర‌పంచంలోనే పెద్ద జంతువు, భారీ కాయం క‌లిగిన ఏనుగుకు గాయమైతే ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఒక్క‌సారి ఊహించండి. వ‌ర్ణణాతీతం కావాలంటె ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది.

గురువారం ఉదయం కేర‌ళ రాష్ట్రం పాలక్కాడ్ జిల్లా వ‌ళయార్ వ‌ద్ద‌ కోయంబత్తూరు నుంచి మంగళూరు వెళ్తున్న ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్ ఏనుగును ఢీ కొట్టింది. దీంతో ఆ ఏనుగు తీవ్రంగా గాయ‌ప‌డి వెనుకాల రెండు కాళ్లు బాగా దెబ్బ‌తిని క‌ద‌ల్లేక ప‌ట్టాల మీది నుంచి ప‌క్క‌కు వెళ్ల‌డానికి అప‌సోపాలు ప‌డింది. ముంద‌రి కాళ్ల‌కు భారీ గాయాలైన‌ప్ప‌టికీ వాటినే ఆస‌రాగా చేసుకుని పాకుతూ నానా ఇబ్బందులు ప‌డుతూ ప‌ట్టాలు దాటింది.

ఈ వీడియో చూస్తున్నంత‌సేపు ఎవ‌రైనా బాధ‌ప‌డి క‌న్నీరు కార్చ‌కుండా ఉండ‌లేరు. కాగా వ‌ల‌యార్ ద‌గ్గ‌ర ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌రుగుతూనే ఉన్నాయి. కొన్ని ఏనుగులు గాయాల‌తో బ‌య‌ట ప‌డుతుండ‌గా మ‌రికొన్ని చ‌నిపోతున్నాయి కూడా. గ‌డిచిన ఐదేండ్ల‌లో ప‌దుల సంఖ్య‌లో ఏనుగులు మ‌ర‌ణించాయి.