Another SkyLab | పది పదిహేను రోజుల్లోనే భూమిపై పడనున్న మరో ‘స్కైలాబ్’.. పడేది ఎక్కడంటే..
Another SkyLab | అంతరిక్షం రానురాను పెద్ద చెత్తకుప్పలా మారిపోతున్నది. అంతరిక్షంలోకి ప్రయోగించిన తర్వాత పనికిరాకుండా పోయిన ఉపగ్రహాలు, వాటి నుంచి విడిపోయిన భాగాలు.. యథేచ్ఛగా అంతరిక్షంలో తిరుగుతున్నాయి. ఇలాంటిదే సోవియట్ కాలపు ఒక స్పేస్‌క్రాఫ్ట్ శాస్త్రవేత్తల నుంచి కట్టు తెంచుకున్నది. ఇప్పుడు అది భూమి దిశగా దూసుకొస్తున్నది

- కట్టుతప్పిన సోవియట్ కాలపు స్పేస్‌క్రాఫ్ట్
- భూమిపై ఎక్కడైనా కూలిపోయే చాన్స్!
- దారిమళ్లించే ప్రయత్నాల్లో శాస్త్రవేత్తలు
Another SkyLab | అంతరిక్షం నుంచి భూమికి తరచూ ముప్పు ఎదురవుతూ ఉంటుంది. మొన్నామధ్య భూమి, చంద్రుడి మధ్యగా ఒక భారీ ఉపగ్రహ శకలం దూసుకొస్తున్నదని వార్తలు చూశాం. దానితో భూమికి ఎలాంటి ముప్పులేదని అనుకున్నా.. తాజాగా మరో వార్త శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేస్తున్నది. మీకు తెలిసే ఉంటుంది.. గతంలో అంతరిక్ష ప్రయోగకేంద్రం ‘స్కైలాబ్’ భూమిపై పడిపోతున్నదని తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఇక యుగాంతమే అనుకున్నారు. కానీ.. శాస్త్రవేత్తలు ఎంతో కష్టంతో దానిని దారిమళ్లించగలిగారు. ఆ ప్రమాదం ముందుకు వచ్చిన సమయంలో పుట్టిన పిల్లలకు స్కైలాబ్ అని పేర్లు పెట్టుకున్నవారూ ఉన్నారు. ఇప్పుడు మరోసారి అంతటి పెను విత్తును భూమి ఎదుర్కొన్నబోతున్నది.
మే 10న లేదా కాస్త అటూ ఇటూగా కూలనున్న స్పేస్‌క్రాఫ్ట్
సోవియట్ కాలంలో అనేక ఉపగ్రహాలను ఆ దేశం అంతరిక్షంలోకి పంపించింది. వాటిలో కొన్ని కాలం చెల్లినవి కూడా ఉన్నాయి. అలాంటి ఒక స్పేస్‌క్రాఫ్ట్ ఒకటి ఇప్పుడు నియంత్రణను తప్పింది. అది భూమి దిశగా దూసుకువస్తున్నది. మే 10వ తేదీన లేదా ఒకటి రెండు రోజుల ముందు లేదా తర్వాత ఇది భూమికి చేరనున్నది. అయితే.. అది భూమిపై ఎక్కడ పడుతుందన్న విషయంలో ఎలాంటి స్పష్టతలేదు. ఇది ఎక్కడైనా పడొచ్చు. దీనిపేరు కోస్మోస్482. ఇది డిస్సెంట్ క్రాఫ్ట్. వాస్తవానికి ఇది యూఎస్ఎస్ఆర్ వెనెరా కార్యక్రమంలో భాగం. శుక్రగ్రహాన్ని అధ్యయనం చేసేందుకు దీని ఉద్దేశించారు. ఇప్పుడు ఇదే భూమికి ముప్పుగా తయారైంది.
అప్పట్లోనే విఫలం
కోస్మోస్ 482ను 1972 మార్చి 31న అంతరిక్షంలోకి పంపారు. అయితే.. వీనస్‌పైకి వెళ్లాల్సిన ఈ స్పేస్‌క్రాఫ్ట్.. బూస్టర్ అనుకున్న విధంగా పనిచేయకపోవడంతో తగినంత వెలాసిటీ లేక వీనస్‌ను చేరుకోలేక పోయింది. దాంతో 495 కేజీల ఈ మాడ్యూల్ భూమిచుట్టూ క్షీణిస్తున్న దీర్ఘవృత్తాకార కక్ష్యలోనే అప్పటి నుంచీ ఉండిపోయింది. శుక్రుని వాతావరణంలో ఉండే తీవ్రమైన ఒత్తిళ్లు, వేడిని తట్టుకునేలా కోస్మోస్ 482ను నిర్మించారు. ఇదే కారణంతో అది తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో కూడా అదేతరహాలో చెక్కుచెదరకుండా ఉంటుందని డచ్ ఉపగ్రహ ట్రాకర్ మార్కో లాంగ్బ్రూక్ చెబుతున్నారు. భూమిని ఉల్క తాకినప్పుడు ఎంతటి ప్రమాదం ఉంటుందో అంతే స్థాయి ప్రమాదం ఉంటుందని అంటున్నారు. మార్క్ లాంగ్బ్రూక్.. డెల్ట్ టెక్నికల్ యూనివర్సిటీలో ఉపన్యాసకుడిగా ఉన్నారు. కోస్మోస్ 482 కదలికలను ఆయన సునిశితంగా పరిశీలిస్తున్నారు. అసాధారణ స్థితిలో అది భూమిపైకి దూసుకొస్తున్న కారణంగా దాని రాకను కచ్చితంగా అంచనా వేసే పరిస్థితి కూడా లేదని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. దీనిలోని అనేక భాగాలు విచ్ఛిన్నమైపోయి.. సముద్రాల్లో పడిపోయే అవకాశం ఉన్నా.. కొన్ని భాగాలు మాత్రం భూమిపై పడే అవకాశం ఉంది.
ఇవికూడా చదవండి..
Indo Pak War | 2025లోనే భారత్, పాక్ యుద్ధం.. 2019లో ఎలా చెప్పారు? అణ్వాయుధాల వాడకంపై ఏమన్నారంటే?
Mango: కల్తీ మామిడి పండ్లను.. గుర్తించండిలా!
Amarnath Yatra | అమర్నాథ్ యాత్రలోని రహస్యం ఇదే..! శివపార్వతుల కథ విన్నది ఆ రెండు చిలుకలేనట..!!
Climate change | మరో పదిహేనేళ్లలోనే ఆ సిటీల్లో జీవనం అసాధ్యం! ఇండియాలో ఆ సిటీలు కూడా?
Global Warming | ఎండల తీవ్రతను తగ్గించవచ్చా? భూమికి గొడుగు వేసేందుకు బ్రిటన్ చేస్తున్న ప్రయోగం ఏంటి?