అమెరికా.. టాప్10 ధనవంతులు వీరే!

వాషింగ్‌టన్: అమెరికా ధనవంతుల్లో టెస్లా సీఈవో ఎలాన్‌మస్క్ అగ్రస్థానంలో మళ్లీ నిలిచారు. ప్రపంచంలో అత్యంత ధనవంతులపై సర్వేలు చేసే ఫోర్బ్స్.. తాజాగా అమెరికా ధనవంతుల జాబితాను విడుదల చేసింది.
ఇందులో మస్క్ మొదటిస్థానంలో కొనసాగుతున్నాడు. ఈయన ఆస్తి 251 బిలియన్ డాలర్లు. ఆయన తరువాత అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ 161 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో, ఒరాకిల్ కో –ఫౌండర్ లార్రీ ఎల్లీసన్ 158 డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు.
బెర్క్ షైర్ హత్‌వేస్ చైర్మన్ వారెన్ బఫెట్ 121 డాలర్లు, గూగుల్ కో –ఫౌండర్ లారీ పేజ్ 114 బిలియన్ డాలర్లు, బిల్ గేట్స్ 111 బిలియన్ డాలర్లు, సెర్గే బ్రిన్ 110 బిలియన్ డాలర్లు, మార్క్ జుకర్ బర్గ్ 106 బిలియన్ డాలర్లు, మైక్రోసాప్ట్ మాజీ సీఈవో స్టీవ్ బల్ మేర్, బ్లూమ్‌బర్గ్ కో –ఫౌండర్ మైఖేల్ ఉన్నారు.
ALSO READ : US Army | 90వేల మంది సైనికులకు అమెరికా గుడ్‌బై?