Major Car Accident: విజయోత్సవ ర్యాలీపై దూసుకెళ్లిన కారు!

Major Car Accident: తమ జట్టు కప్పు గెలిచిన ఆనందంలో సాకర్ అభిమానులు భారీ విజయోత్సవ ర్యాలీతో సంబరాలు చేసుకుంటున్నారు. డాన్స్ లు. కేరింతలు..పరస్పర అభినందనలతో ర్యాలీ సాగుతుంది. అంతలో అనూహ్యంగా రయ్ మంటూ దూసుకొచ్చిందో కారు. ర్యాలీలో ఒళ్లు మరిచి సంబరాల్లో మునిగిన అభిమానుల మీదుగా కారు దూసుకెలుతుంటే..అప్పటిదాకా వినిపించిన కేరింతలు కాస్తా ఆహాకారాలు..ఆర్తనాదాలుగా మారిపోయాయి. ఈ ఘటన ఇంగ్లాండ్ లో చోటుచేసుకుంది. ఇంగ్లండ్ లో సాకర్(ఫుట్ బాల్) ప్రీమియర్ లీగ్ పోటీల్లో లివర్ పూల్ టీమ్ టైటిల్ గెలుచుకుంది. దీంతో లివర్ పూల్ సిటీలో అభిమానులు విక్టరీ సెలబ్రేషన్స్ ర్యాలీ నిర్వహించారు.
వేలాదిగా తరలివచ్చిన అభిమానులు విజయోత్సవం సంబరాలు జరుపుకుంటున్నారు. విక్టరీ పరేడ్ ర్యాలీపైకి ఓ కారు అకస్మాత్తుగా అదుపుతప్పి అభిమానులపైకి దూసుకెళ్లింది. వరుస క్రమాన్ని తలపించేలా కారు ర్యాలీలోని అభిమానుల మీదుగా దూసుకెళ్లడంతో పదుల సంఖ్యలో ఫ్యాన్స్ కు గాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కారు డ్రైవర్ ను పట్టుకుని అభిమానులు చితకబాదగా..పోలీసులు అతడిని రక్షించి అరెస్టు చేశారు. ఈ ప్రమాద ఘటనపై యూకే పీఎం స్టార్మర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
విక్టరీ పరేడ్.. ఫ్యాన్స్ పైకి దూసుకెళ్లిన కారు..
ప్రీమియర్ లీగ్ సాకర్ టైటిల్ గెలిచిన లివర్ పూల్ టీమ్
ఇంగ్లండ్ లోని లివర్ పూల్ సిటీలో విక్టరీ సెలబ్రేషన్స్
వేలాదిగా తరలివచ్చిన అభిమానులు
అదే సమయంలో ఫ్యాన్స్ పైకి దూసుకెళ్లిన కారు
పదుల సంఖ్యలో ఫ్యాన్స్ కు గాయాలు
కారు డ్రైవర్ ను… pic.twitter.com/Ble4pR3TGJ
— Telangana Awaaz (@telanganaawaaz) May 27, 2025