Viral And How| వారిద్దరిది 20 ఏళ్ల వైరం. 2004 ఎరోటిక్ థ్రిల్లర్ `మర్డర్`లో వారు జంటగా నటించారు. అయితే సెట్స్‌లో ఏం జరిగిందో ఏమో తెలియదు కాని అతను బ్యాడ్ కిస్సర్ అంటూ మల్లిక అతని గురించి నెగెటివ్‌గా మాట్లాడింది. దాంతో గత 20 ఏళ్లుగా వారిద్దరి మధ్య వైరం నడుస్తూనే ఉంది. కాని 20 సంవత్సరాల తరువాత చివరకు వారిరువురు వైరాన్ని వదిలిపెట్టి తిరిగి కలుసుకున్నారు. వారిని అలా చూసి అభిమానులు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. మరి ఇంతకు వారు ఇరువురు ఎవరనే కదా మీ డౌట్.. సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ – హాట్ బాంబ్ మల్లికా షెరావత్ . ఈ ఇద్దరు ముంబైలో జరిగిన సినీ నిర్మాత ఆనంద్ పండిట్ కుమార్తె వివాహ రిసెప్షన్లో కలిసి ఒకరినొకరు హగ్ ఇచ్చుకొని ఫొటోలకి పోజులిచ్చారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
రెడ్ కార్పెట్‌పై ఇమ్రాన్- మల్లిక జంట ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకోవడంతో పాటు ఫోటోగ్రాఫర్ల కోసం పోజులిస్తూ నవ్వుతూ కనిపించారు. మల్లిక పింక్ గౌనులో నెక్లైన్తో చాలా గ్లామర్‌గా కనిపించగా, ఇక ఇమ్రాన్ బ్లాక్ కలర్ సూట్లో మెరిసిపోయాడు. అయితే ఫొటోగ్రాఫర్స్ ముందు ఈ ఇద్దరు సిగ్గుపడడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక నెటిజన్స్ మల్లిక అందాన్ని, ఆమె హాట్‌నెస్‌ని తెగ పొగిడేస్తున్నారు. ఇమ్రాన్, మల్లిక జంటగా నటించిన `మర్డర్` 20 ఏళ్ల క్రితం థియేటర్స్‌లోకి వచ్చి పెద్ద విజయం సాధించింది. అయితే ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏదో గొడవ కాగా, 2021లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మల్లిక మర్డర్ సెట్స్‌లో ఇమ్రాన్‌తో తన ఫైటింగ్ గురించి గుర్తుచేసుకుంది. మర్డర్ తర్వాత ఇమ్రాన్, నేను మాట్లాడుకోలేదు. సినిమా తర్వాత ప్రమోషన్స్‌లో ఏదో పొరపాటు జరిగిందని భావిస్తున్నాను.
నేను పంతంలో తక్కువ తినలేదు. అది తలచుకుంటే చిన్నతనంగా అనిపిస్తుందని, ఇమ్రాన్‌తో నేను టచ్‌లో లేనంటూ మల్లిక ఓ సందర్భంలో వ్యాఖ్యానించింది. ఇక 2014లో ఇమ్రాన్ హష్మీ `కాఫీ విత్ కరణ్` చాట్ షోలో స్క్రీన్‌పై బెస్ట్ చెత్త ముద్దుల పేర్లు చెప్పమనగా, ఆయన సహనటి మల్లికతో అని చెప్పాడు. `మర్డర్ 2`లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో లిప్ లాక్ ను మంచి ముద్దుగా కాంప్లిమెంట్ ఇచ్చాడు. మలైకాపై అయిష్ఠతను వ్యక్తం చేస్తూ జాక్వెలిన్ ని పొగిడేయడంతో అప్పుడు ఈ విషయం హాట్ టాపికే అయింది.