MP MithunReddy| ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి : ఏపీ లిక్కర్ స్కామ్(AP LiquorScam) కేసులో వైసీపీ(YSRCP)ఎంపీ మిథున్ రెడ్డి(MP MithunReddy)కి విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada ACBCourt)మధ్యంతర బెయిల్(Interim Bail) మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో(Election 2025)ఓటు వేసేందుకు కోర్టు అనుమతినిస్తూ ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తిరిగి మిథున్ రెడ్డి ఈనెల 11న సాయంత్రం 5గంటలకు సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. మిథున్ రెడ్డికి రూ.50 వేల పూచికత్తుతో రెండు ష్యూరిటీలతో మధ్యంతర బెయిల్ లభించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ఏ 4గా ఉన్నారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఈ నెల 9న జరుగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీఏకు వైసీపీ మద్ధతునిస్తుంది. ఎన్డీఏ(NDA) నుంచి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి(INDIA Alliance) నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డిలో బరిలో ఉన్నారు. మొత్తం ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల సంఖ్య 781 కాగా.. మెజార్టీ మార్కు 391. అధికార పక్షానికి 422 మంది సభ్యుల మద్దతు ఉంది.