Nayanthara|పాపం.. న‌య‌న‌తార‌కి స‌వతి పోరు.. ఇలా వ‌రుస స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతుందేంటి?

Nayanthara: లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార క్రేజ్, ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. స్టార్ హీరోల‌ని మించిన ఫాలోయింగ్ ఆమె సొంతం. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు, లేడి ఓరియెంటెడ్ సినిమాల‌తో త‌న స్థాయిని మ‌రింత పెంచుకుంది. సాధార‌ణంగా ఓ హీరోయిన్ కెరీర్ ఐదేళ్లు సాగిందంటే ఈ

Nayanthara|పాపం.. న‌య‌న‌తార‌కి స‌వతి పోరు.. ఇలా వ‌రుస స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతుందేంటి?

Nayanthara: లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార క్రేజ్, ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. స్టార్ హీరోల‌ని మించిన ఫాలోయింగ్ ఆమె సొంతం. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు, లేడి ఓరియెంటెడ్ సినిమాల‌తో త‌న స్థాయిని మ‌రింత పెంచుకుంది. సాధార‌ణంగా ఓ హీరోయిన్ కెరీర్ ఐదేళ్లు సాగిందంటే ఈ రోజుల్లో చాలా గొప్ప‌. కాని న‌య‌న‌తార గ‌త 20 ఏళ్ళుగా సినిమా ప‌రిశ్ర‌మ‌ని షేక్ చేస్తుంది. మరీ ముఖ్యంగా తమిళ పరిశ్రమను ఏలుతూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. న‌య‌న‌తార ఎంత డిమాండ్ చేసిన అంత ఇచ్చేందుకు కూడా నిర్మాత‌లు సైతం సిద్ధంగా ఉన్నారంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో మ‌న‌కి ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ వైవిధ్య‌మైన సినిమాలు చేస్తుంది.

 

స్టార్ హీరోల‌తో పాటు యంగ్ హీరోల‌తోను ఈ బ్యూటీ జ‌త‌క‌డుతుంది.ఇటీవ‌ల షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో క‌థానాయిక‌గా న‌టించి బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టింది. అయితే ఇప్పుడు న‌య‌న‌తార‌కి స‌వతిపోరు ఎక్కువ‌య్యేలా కనిపిస్తుంది. స‌వ‌తిపోరు అంటే పర్స‌న‌ల్ లైఫ్‌లో కాదులేండి, సినిమాల‌లో. కొన్నాళ్ళుగా కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న న‌య‌న‌తార‌కి ఇప్పుడు త్రిష గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధ‌మైంద‌ని తెలుస్తుంది. న‌య‌న‌తార, త్రిష మ‌ధ్య పోటీ ఎప్ప‌టినుండో ఉంది. అయితే ఆ మ‌ధ్య త్రిష కొంత సైలెంట్ కాగా న‌య‌న‌తార మాత్రం జెట్ స్పీడ్‌తో దూసుకుపోతూనే ఉంది.

అయితే త్రిష ఇటీవ‌ల పొన్నియన్ సెల్వన్ సినిమాతో హిట్ అందుకుంది. ఈ క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభ‌ర సినిమాలోను ఎంపికైంది. త్రిషని ఇప్పుడు వ‌రుస అవకాశ‌లు ప‌ల‌క‌రిస్తుండ‌గా, న‌య‌న‌తార‌ని మాత్రం దుర‌దృష్టం వెంటాడుతుంది. న‌య‌న్ ఈ మ‌ధ్య చేసిన సినిమాల‌న్నీ కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టాయి. అంతేకాకుండా ఆమె రెమ్యునరేష‌న్ ఎక్కువ‌గా డిమాండ్ చేస్తుండ‌డంతో నిర్మాత‌లు వెన‌క్కి త‌గ్గుతూ త్రిష వెన‌క ప‌డుతున్న‌ట్టుగా తెలుస్తుంది. ఈ క్ర‌మంలో నయనతార ఇప్పుడు మాలీవుడ్ పై కూడా దృష్టి పెడుతున్న‌ట్టుగా అర్ధ‌మ‌వుతుంది. మలయాళంలో డియర్‌ స్టూడెంట్‌ అనే సినిమాలో చేస్తుండ‌గా, ఇందులో టీచ‌ర్ పాత్ర పోషిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమా అయిన న‌య‌న్‌కి మంచి స‌క్సెస్ అందిస్తుందా లేదా అనేది చూడాలి.