మొత్తం ఓటర్లలో శతాధిక ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా?
ఏడు దశల్లో జరుగబోయే లోక్సభ ఎన్నికల్లో భావి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు దేశవ్యాప్తంగా 96.8 కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు

ఏడు దశల్లో జరుగబోయే లోక్సభ ఎన్నికల్లో భావి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు దేశవ్యాప్తంగా 96.8 కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 49.7 కోట్లు ఉంటే.. మహిళా ఓటర్లు 47.1 కోట్ల మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా 543 మంది లోక్సభ సభ్యులను ఎన్నుకునేందుకు మొత్తం 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా.. అందులో 55 లక్షల ఈవీఎంలు ఉంటాయి. మొత్తం ఎన్నికల ప్రక్రియలో 1.5 కోట్ల మంది పోలింగ్, భద్రతా సిబ్బంది పాల్గొంటారు. ఇవీ వివరాలు..
మొత్తం ఓటర్లు : 96.8 కోట్లు
పురుషులు : 49.7 కోట్లు
మహిళలు : 47.1 కోట్లు
ట్రాన్స్జెండర్లు : 48,000
తొలిసారి ఓటేయనున్నది : 1.8 కోట్లు
దివ్యాంగులు : 88.4 కోట్లు
సర్వీస్ ఓటర్లు : 19.1 లక్షలు
85 ఏళ్లు పైబడినవారు : 82 లక్షలు
యువ ఓటర్లు (20 నుంచి 29 ఏళ్లు) 19.74 కోట్లు
శతాధిక వయస్కులు : 2.18 కోట్లు
మొత్తం పోలింగ్ స్టేషన్లు : 10.5 లక్షలు
ఈవీఎంలు : 55 లక్షలు
పోలింగ్, భద్రతా సిబ్బంది : 1.5 కోట్లు