Narsampet | నర్సంపేట మెడికల్ కాలేజీకి రూ.183 కోట్లు

Narsampet | విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలను శుక్రవారం ప్రారంభించిన ప్రభుత్వం, ఇటీవల మంజూరైన నర్సంపేట మెడికల్ కళాశాలకు రూ.183 కోట్ల నిధులను కేటాయించింది. ఈ మేరకు శనివారం జీవో 162 ను విడుదల చేసింది. త్వరలో టెండర్ ప్రక్రియ ప్రారంభమై, వచ్చే నెలలో పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే నర్సంపేటలో 450 పడకల జిల్లా ఆసుపత్రి, 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ పనులు పూర్తి కావస్తున్నాయి. తాజాగా […]

  • By: krs    latest    Sep 16, 2023 2:53 PM IST
Narsampet | నర్సంపేట మెడికల్ కాలేజీకి రూ.183 కోట్లు

Narsampet |

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలను శుక్రవారం ప్రారంభించిన ప్రభుత్వం, ఇటీవల మంజూరైన నర్సంపేట మెడికల్ కళాశాలకు రూ.183 కోట్ల నిధులను కేటాయించింది. ఈ మేరకు శనివారం జీవో 162 ను విడుదల చేసింది.

త్వరలో టెండర్ ప్రక్రియ ప్రారంభమై, వచ్చే నెలలో పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే నర్సంపేటలో 450 పడకల జిల్లా ఆసుపత్రి, 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ పనులు పూర్తి కావస్తున్నాయి.

తాజాగా మెడికల్ కాలేజీ మంజూరుతో పాటు, నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో నర్సంపేటలో మెడికల్ సౌకర్యాలు పెరుగనున్నాయి. మారుమూల ప్రాంత పేదలకు మెరుగైన వైద్యం, పేద విద్యార్థులకు వైద్య విద్య అందనుంది.

ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీష్ రావు, సహకరించిన జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.