Uttar Pradesh | యూపీలో 24 గంటల్లో 19 మంది మృతి
Uttar Pradesh | లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఉత్తరప్రదేశ్ అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించిపోయింది. రవాణాకు ఆటంకం కలిగింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 24 గంటల్లో కురిసిన భారీ వర్షానికి 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని యూపీ రిలీఫ్ కమిషనర్ సంజయ్ గోయల్ అధికారికంగా ధృవీకరించారు. హర్దోయిలో నలుగురు, […]

Uttar Pradesh |
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఉత్తరప్రదేశ్ అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించిపోయింది. రవాణాకు ఆటంకం కలిగింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
24 గంటల్లో కురిసిన భారీ వర్షానికి 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని యూపీ రిలీఫ్ కమిషనర్ సంజయ్ గోయల్ అధికారికంగా ధృవీకరించారు.
హర్దోయిలో నలుగురు, బరాబంకిలో ముగ్గురు, ప్రతాప్‌ఘర్, కన్నౌజ్‌లో ఇద్దరి చొప్పున, అమేథి, దియోరా, జలౌన్, కాన్పూర్, ఉన్నావ్, సాంబాల్, రామ్‌పూర్, ముజఫర్‌నగర్ జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారు. వీరిలో నలుగురు పిడుగుపాటుకు బలయ్యారు.