జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ ముగ్గురు ఉగ్రవాదులు హతం

Jammu and Kashmir encounter | జమ్మూ కశ్మీర్‌లోని సిధ్రాలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పులు జరిగినప్పుడు ఉగ్రవాదులు ట్రక్కులో ఉనారని జమ్మూ కశ్మీర్‌ ఏడీజీపీ తెలిపారు. ముగ్గురు ఉగ్రవాదులను హతమయ్యారని, సంఘటనా స్థలం నుంచి ఓ ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఉధంపూర్ జిల్లాలో 15 కిలోల ఐఈడీ(IED)ని పోలీసులు నిర్వీర్యం చేసిన తర్వాత బలగాలు మరోసారి పైచేయి సాధించాయి. బసంత్‌గఢ్ ప్రాంతంలో ఐఈడీతో పాటు 300-400 […]

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ ముగ్గురు ఉగ్రవాదులు హతం

Jammu and Kashmir encounter | జమ్మూ కశ్మీర్‌లోని సిధ్రాలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పులు జరిగినప్పుడు ఉగ్రవాదులు ట్రక్కులో ఉనారని జమ్మూ కశ్మీర్‌ ఏడీజీపీ తెలిపారు. ముగ్గురు ఉగ్రవాదులను హతమయ్యారని, సంఘటనా స్థలం నుంచి ఓ ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఉధంపూర్ జిల్లాలో 15 కిలోల ఐఈడీ(IED)ని పోలీసులు నిర్వీర్యం చేసిన తర్వాత బలగాలు మరోసారి పైచేయి సాధించాయి. బసంత్‌గఢ్ ప్రాంతంలో ఐఈడీతో పాటు 300-400 గ్రాముల ఆర్‌డీఎక్స్, ఏడు 7.62 ఎంఎం క్యాట్రిడ్జ్‌లు, ఐదు డిటోనేటర్‌లను స్వాధీనం చేసుకొని భారీ ఉగ్రకుట్రను బలగాలు భగ్నం చేశాయి. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన కోడెడ్ షీట్, లెటర్ ప్యాడ్ పేజీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ అనుమానితుడిని సైతం అదుపులోకి తీసుకున్నారు.