అయోధ్య‌: డ్యాన్స్ చేశార‌ని.. న‌లుగురు మ‌హిళా కానిస్టేబుళ్లపై వేటు

Viral Video | అయోధ్య‌లో నిర్మిస్తున్న రామ మందిరం వ‌ద్ద ఓ నలుగురు మ‌హిళా కానిస్టేబుల్స్ విధుల్లో ఉన్నారు. అయితే సివిల్ డ్రెస్సుల్లో ఉన్న ఆ న‌లుగురు కానిస్టేబుల్స్.. భోజ్‌పురి సాంగ్‌కు స్టెప్పులేశారు. అయితే ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. మ‌హిళా కానిస్టేబుల్స్ విధుల్లో ఉన్న స‌మ‌యంలో డ్యాన్స్ చేసిన విష‌యం పోలీసు ఉన్న‌తాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో న‌ల‌గురు కానిస్టేబుల్స్‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు సీనియ‌ర్ సూప‌రింటెండెంట్ పోలీసు ఆఫీస‌ర్ మునిరాజ్ జీ ఉత్త‌ర్వులు […]

అయోధ్య‌: డ్యాన్స్ చేశార‌ని.. న‌లుగురు మ‌హిళా కానిస్టేబుళ్లపై వేటు

Viral Video | అయోధ్య‌లో నిర్మిస్తున్న రామ మందిరం వ‌ద్ద ఓ నలుగురు మ‌హిళా కానిస్టేబుల్స్ విధుల్లో ఉన్నారు. అయితే సివిల్ డ్రెస్సుల్లో ఉన్న ఆ న‌లుగురు కానిస్టేబుల్స్.. భోజ్‌పురి సాంగ్‌కు స్టెప్పులేశారు. అయితే ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

మ‌హిళా కానిస్టేబుల్స్ విధుల్లో ఉన్న స‌మ‌యంలో డ్యాన్స్ చేసిన విష‌యం పోలీసు ఉన్న‌తాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో న‌ల‌గురు కానిస్టేబుల్స్‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు సీనియ‌ర్ సూప‌రింటెండెంట్ పోలీసు ఆఫీస‌ర్ మునిరాజ్ జీ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

వేటు ప‌డిన వారిలో క‌విత ప‌టేల్, కామిని కుష్వాహా, కషీశ్ సాహ్నీ, సంధ్యా సింగ్ ఉన్నారు. విచార‌ణ అనంత‌రం వీరిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసు ఉన్న‌తాధికారులు పేర్కొన్నారు.