గచ్చిబౌలిలో 5 కోట్ల నగదు పట్టివేత

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతుంది.

గచ్చిబౌలిలో 5 కోట్ల నగదు పట్టివేత

విధాత : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతున్నది. గురువారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని బొటానికల్ పార్క్ నుంచి చిరేక్ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్తున్న కారును తనిఖీ చేసిన పోలీసులు ఐదు కోట్లు పట్టుకున్నారు. ఈ నగదు ఓ వ్యాపారవేత్తకు సంబంధించినదిగా గుర్తించారు. రెండు సంచుల్లో పట్టుబడిన నగదును ఐటీ శాఖకు అప్పగించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.