America | విద్యార్థుల‌తో లైంగిక సంబంధాలు.. ఆరుగురు మ‌హిళా టీచ‌ర్లు అరెస్ట్

America | విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచ‌ర్లే వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డ్డారు. ఏకంగా విద్యార్థుల‌తోనే మ‌హిళా టీచ‌ర్లు లైంగిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న‌లు అమెరికాలో వెలుగు చూశాయి. ఈ ఘ‌ట‌న‌లు వెలుగు చూడడంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై.. రెండు రోజుల వ్య‌వధిలో ఆరుగురు మ‌హిళా టీచ‌ర్ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ మ‌హిళా టీచ‌ర్ల‌పై అత్యాచారం కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వివ‌రాల్లోకి వెళ్తే.. కాలిఫోర్నియాలోని డానివిల్లే ప‌ట్ట‌ణానికి చెందిన ఎలెన్ షెల్‌(38) స్థానిక పాఠ‌శాల‌లో […]

America | విద్యార్థుల‌తో లైంగిక సంబంధాలు.. ఆరుగురు మ‌హిళా టీచ‌ర్లు అరెస్ట్

America | విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచ‌ర్లే వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డ్డారు. ఏకంగా విద్యార్థుల‌తోనే మ‌హిళా టీచ‌ర్లు లైంగిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న‌లు అమెరికాలో వెలుగు చూశాయి. ఈ ఘ‌ట‌న‌లు వెలుగు చూడడంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై.. రెండు రోజుల వ్య‌వధిలో ఆరుగురు మ‌హిళా టీచ‌ర్ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ మ‌హిళా టీచ‌ర్ల‌పై అత్యాచారం కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. కాలిఫోర్నియాలోని డానివిల్లే ప‌ట్ట‌ణానికి చెందిన ఎలెన్ షెల్‌(38) స్థానిక పాఠ‌శాల‌లో టీచ‌ర్‌గా ప‌ని చేస్తోంది. అయితే ప‌ని చేసే స్కూల్లోని 16 ఏండ్ల వ‌య‌సున్న ఇద్ద‌రు విద్యార్థుల‌తో లైంగిక చ‌ర్యకు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెలువెత్తాయి. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. అనంత‌రం గరార్డ్ కౌంటీ కోర్టు ముందు హాజ‌రుప‌రిచారు. ఆ మ‌హిళా టీచ‌ర్‌పై థ‌ర్డ్ డిగ్రీ అత్యాచారం అభియోగాలు న‌మోదు చేశారు పోలీసులు. అర్క‌న్సాస్ రాష్ట్రానికి చెందిన హెథ‌ర్ హ‌రే(32) అనే టీచ‌ర్‌పై కూడా లైంగిక దాడి కేసు న‌మోదైంది. ఈమె టీనేజ్ విద్యార్థితో లైంగిక సంబంధం కొన‌సాగిస్తున్న‌ట్ల ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఒక్ల‌హామాకు చెందిన ఎమిలీ హ‌న్‌కాక్‌(26) అనే టీచ‌ర్ ఈ వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. లిన్‌కాల్న్ కౌంటీలోని టీచ‌ర్ ఎమ్మా డిలానే అనే టీచ‌ర్.. అదే పాఠ‌శాల‌లో చ‌దువుతున్న 15 ఏండ్ల విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుంది. అయేవా రాష్ట్రంలోని దేస్ మెయిన్స్‌లో ఉన్న ఓ హైస్కూల్‌లో క్రిస్టెన్ గ్యాంట్ అనే ఇంగ్లీష్ టీచ‌ర్ కూడా మ‌రో విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుంది. ఈ కేసులో పోలీసులు ఆధారాలు సేక‌రించారు.

వ‌ర్జీనియాలోని ఓ హైస్కూల్‌లో ప‌ని చేస్తున్న మ‌హిళా టీచ‌ర్(33) కూడా ఓ విద్యార్థి చాలా కాలం నుంచి అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తూ అత‌న్ని లొంగ‌దీసుకుంది. దీంతోఆమెపై కూడా కేసు న‌మోదైంది. ఇలా అమెరికాలోని ప‌లు రాష్ట్రాల్లో విద్యార్థుల‌ను లైంగిక లోబ‌ర్చుకున్న టీచ‌ర్ల‌ను పోలీసులు అరెస్టు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.