మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో 600 పేజీల ఛార్జ్షీట్
విధాత,హైదరాబాద్: మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో పోలీసులు నేరాభియోగ పత్రాలు దాఖలు చేశారు. 600 పేజీలతో కూడిన నేరాభియోగ పత్రంలో 75 మంది సాక్ష్యులను చేర్చారు. ఎల్బీనగర్ కోర్టులో నేరాభియోగ పత్రం దాఖలు చేసిన పోలీసులు నాగేశ్వరరావు నేరం చేశాడు అనడానికి తగిన ఆధారాలను పొందుపరిచారు. జులై 7న వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో నాగేశ్వరరావు పై ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం విదితమే. తనపై లైంగికదాడి చేయడంతో పాటు కిడ్నాప్ చేశారని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. […]

విధాత,హైదరాబాద్: మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో పోలీసులు నేరాభియోగ పత్రాలు దాఖలు చేశారు. 600 పేజీలతో కూడిన నేరాభియోగ పత్రంలో 75 మంది సాక్ష్యులను చేర్చారు. ఎల్బీనగర్ కోర్టులో నేరాభియోగ పత్రం దాఖలు చేసిన పోలీసులు నాగేశ్వరరావు నేరం చేశాడు అనడానికి తగిన ఆధారాలను పొందుపరిచారు.
జులై 7న వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో నాగేశ్వరరావు పై ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం విదితమే. తనపై లైంగికదాడి చేయడంతో పాటు కిడ్నాప్ చేశారని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు జులై 11న నాగేశ్వరరావు ను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించారు.
అనంతరం 18వ తేదీన కస్టడీలోకి తీసుకుని 5 రోజుల పాటు విచారించారు. ఆయన లైంగికదాడి చేశాడు అనడానికి తగిన ఆధారాలు సేకరించారు. మహిళ లోదుస్తులతో నాగేశ్వరరావు డీఎన్ఏను సరిపోల్చారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో ఇవి రెండు సరిపోయాయి. సీసీ కెమెరాల దృశ్యాలను కూడా పరిశీలించారు. ఆయన మొబైల్‌ను విశ్లేషించి లైంగికదాడి జరిగిన సమయంలో మహిళ ఇంట్లోనే ఉన్నట్లు తేల్చారు.
ఆ మహిళ నివాసం ఉండే ఇంటి కాపాలాదారుతో పాటు చుట్టుపక్కల ఉన్నవాళ్ల సాక్ష్యాలను నమోదు చేశారు. ఈ విషయాలన్నింటినీ నేరాభియోగ పత్రంలో పొందుపరిచారు. ఈ కేసు విచారణ ఎల్బీనగర్ కోర్టులో కొనసాగుతున్నది. నాగేశ్వరరావు బైయిల్ తీసుకుని జైలు నుంచి బైటికి వచ్చాడు. లైంగికదాడి ఆరోపణలు రావడంతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నాగేశ్వరరావును విధుల నుంచి తొలిగించిన సంగతి తెలిసిందే.