Vande Bharat | ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో సిద్ధమైన తొమ్మిది వందే భారత్ రైళ్లు..! పలు జోన్లకు కేటాయింపు.. పట్టాలెక్కేది ఈ రూట్లలోనే..!
Vande Bharat | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. వీటికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. దీంతో మరిన్ని ప్రధాన నగరాలను కలుపుతూ సెమీ హైస్పీడ్ రైళ్లను నడిపించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నది. ప్రస్తుతం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న విషయం తెలిసిందే. కోచ్ ఫ్యాక్టరీలో తొమ్మిది కొత్త రైళ్లను సిద్ధం చేసింది. ఇందులో మూడింటిని సౌత్ రైల్వేకు కేటాయించారు. మరొకటి వెస్ట్రన్ రైల్వేకు, నార్త్ వెస్ట్రన్, […]

Vande Bharat |
భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. వీటికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. దీంతో మరిన్ని ప్రధాన నగరాలను కలుపుతూ సెమీ హైస్పీడ్ రైళ్లను నడిపించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నది. ప్రస్తుతం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న విషయం తెలిసిందే.
కోచ్ ఫ్యాక్టరీలో తొమ్మిది కొత్త రైళ్లను సిద్ధం చేసింది. ఇందులో మూడింటిని సౌత్ రైల్వేకు కేటాయించారు. మరొకటి వెస్ట్రన్ రైల్వేకు, నార్త్ వెస్ట్రన్, సౌత్ సెంట్రల్, ఈస్ట్ కోస్ట్ రైల్వే, ఈస్ట్ సెంట్రల్‌కు ఒక్కో రైలును కేటాయించారు. ఇంకా మరో రైలును ఏ జోనుకూ కేటాయించలేదు.
త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఏదో ఒకదానికి కేటాయించే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కొత్తగా కేటాయించిన రైళ్లన్నీ ఎనిమిదికోచ్‌లతో నడుస్తాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రైళ్లు పట్టాలెక్కది తెలియదని.. త్వరలోనే ప్రారంభోత్సవ తేదీలు ఖరారయ్యే అవకాశం ఉందని తెలిపారు.
కొత్తగా ప్రారంభించనున్న రైళ్ల మార్గాలను భారతీయ రైల్వే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇందులో రెండు జైపూర్-ఇండోర్-జైపూర్, జైపూర్-ఇండోర్-జైపూర్ మధ్య నడిచే అవకాశాలున్నాయని ఓ అధికారులు పేర్కొన్నారు. జైపూర్-ఇండోర్ వందే భారత్ నీముచ్ వరకు నడుస్తుందని చెప్పారు. ఇటీవల రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉదయపూర్, నీముచ్ రైల్వే స్టేషన్లను సందర్శించడం గమనార్హం.
రాజస్థాన్‌లో తొలి వందే భారత్‌ను అజ్మీర్-ఢిల్లీ మధ్య ఏప్రిల్‌లో ప్రారంభించగా.. జులైలో జోధ్‌పూర్-సబర్మతి మార్గంలో రైలును కేంద్రం ప్రవేశపెట్టింది. మధ్యప్రదేశ్, ఒడిశాలకు కూడా కొత్త రైళ్లను కేటాయించగా.. ఈస్ట్ కోస్ట్ రైల్వేకు కేటాయించిన ఓ రైలు ఒడిశాలోని పూరి- రూర్కెలాలో నడిచే అవకాశాలున్నాయి. గతంలో ఒడిశాలో తొలి వందే భారత్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా రూర్కెలాకు రైలును కేటాయించనున్నట్లు మంత్రి ప్రకటించారు. 2024 ప్రారంభంలో ఒడిశా ఎన్నికలు జరగనున్నాయి. తూర్పు మధ్య రైల్వేకు కేటాయించిన ఓ రైలు పాట్నా-హౌరా పరుగులు పెడుతున్నది.
దాంతో పాటు దక్షిణ రైల్వేస్‌కు దక్షిణ రైల్వేస్‌కు కేటాయించిన మూడు, ఇతర నాలుగు వందే భారత్‌ల మార్గం ఇంకా ఖరారు కాలేదని సంబంధిత అధికారి తెలిపారు. మరో వైపు ఇప్పటి వరకు దేశంలో 25 వందే భారత్ రైళ్లను రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు ఉండగా.. త్వరలో కాచిగూడ – యశ్వంత్‌పూర్‌తో పాటు పుణే, నాగ్‌పూర్ మార్గాల్లోనూ సెమీ హైస్పీడ్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది.