మెదక్: మహిళ దారుణ హత్య… గొంతు కోసి బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు
దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. క్లూస్ టీమ్… డాగ్ స్వాడ్ లతో విచారణ.. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్పీ రోహిణి విధాత, మెదక్ బ్యూరో: మెదక్ పట్టణంలో ఒక మహిళ దారుణ హత్యకు గురయింది. మెదక్ లో సంచలనం సృష్టించిన మహిళ హత్యకేసు వివరాలు మృతురాలి భర్త వెంకటేశం.. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శేట్పల్లి గ్రామానికి చెందిన తలకొక్కుల వెంకటేశం మరియు అతని కుటుంబ సభ్యులు బ్రతుకుతెరువు కోసం కొంత కాలం కిందట మెదక్ […]

- దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
- క్లూస్ టీమ్… డాగ్ స్వాడ్ లతో విచారణ..
- ఘటన స్థలానికి చేరుకున్న ఎస్పీ రోహిణి
విధాత, మెదక్ బ్యూరో: మెదక్ పట్టణంలో ఒక మహిళ దారుణ హత్యకు గురయింది. మెదక్ లో సంచలనం సృష్టించిన మహిళ హత్యకేసు వివరాలు మృతురాలి భర్త వెంకటేశం.. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
శేట్పల్లి గ్రామానికి చెందిన తలకొక్కుల వెంకటేశం మరియు అతని కుటుంబ సభ్యులు బ్రతుకుతెరువు కోసం కొంత కాలం కిందట మెదక్ కి వలస వచ్చి పెద్ద బజారులో నివాసం ఉంటూ స్థానికంగా ఉన్న మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటూ వారి జీవనాన్ని కొనసాగించేవారు.
వెంకటేశం, సుజాత దంపతులకు ఒక కొడుకు సాయి, ఒక కూతురు సుప్రియ ఉన్నారు. రోజూ వారిగానే సుజాత వెంకటేశం ఇద్దరు మార్కెట్ కి వెళ్లి కూరగాయలు అమ్ముతుండగా మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికెళ్లి వంట చేసి తీసుకొని వస్తాను.. అని సుజాత తన భర్త వెంకటేశంకి చెప్పి ఉదయం 10:00 గంటలకు ఇంటికి వెళ్ళింది.
మధ్యాహ్నం 1.00 గంట అవుతున్న సుజాత మార్కెట్ కి రాకపోగా ఫోన్ కూడా లిఫ్ట్ చెయ్యట్లేదు అని భర్త వెంకటేశం ఇంటికి వెళ్లి చూడగా తన భార్య సుజాత (వయస్సు 42 సంవత్సరాలు) గుర్తు తెలియని దుండగులు మేడ భాగం మరియు గొంతు భాగాన్ని కోసి ఒంటి మీద ఉన్న బంగారు తాడుని ఎత్తుకెళ్లారు.
వెంటనే భర్త వెంకటేశం స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. విషయం తెలుసుకున్న మెదక్ డీఎస్పీ సైదులు, సిఐ మధు, రూరల్ సీఐ విజయ్ కుమార్, SI మల్లారెడ్డి పోలీసు సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి క్లూస్ టీం, మరియు డాగ్ స్క్వాడ్ ద్వారా చేరుకొని ఆధారాలు సేకరించారు.
ఈ సంఘటనతో పెద్దబజార్ లోని వ్యాపారస్థులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున వారి ఇంటి వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఘటన స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. దుండగులను వెంటనే పట్టుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు.