విభజన హామీలు పట్టించుకోని కేంద్రం.. అనుసరిస్తున్న రద్దు.. వద్దు విధానం: దాస్యం
భధ్రకాళి సాక్షిగా ప్రమాణానికి సిద్ధమా? కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి చీప్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ సవాల్ విధాత, వరంగల్: రాష్ట్ర విభజన హామీలపై కేంద్ర బీజేపీ కేవలం వద్దు, రద్దు విధానాన్ని మాత్రమే ఎంచుకుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై అత్యంత దుర్మార్గంగా, అహంకార పూరితంగా రాజ్యసభలో సమాధానమిచ్చిన కేంద్రం తప్పుడు వైఖరిని వ్యతిరేకిస్తూ హనుమకొండ క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా […]

- భధ్రకాళి సాక్షిగా ప్రమాణానికి సిద్ధమా?
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి చీప్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ సవాల్
విధాత, వరంగల్: రాష్ట్ర విభజన హామీలపై కేంద్ర బీజేపీ కేవలం వద్దు, రద్దు విధానాన్ని మాత్రమే ఎంచుకుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై అత్యంత దుర్మార్గంగా, అహంకార పూరితంగా రాజ్యసభలో సమాధానమిచ్చిన కేంద్రం తప్పుడు వైఖరిని వ్యతిరేకిస్తూ హనుమకొండ క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు.
సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, మాజీ పార్లమెంటు సభ్యులు సీతారాం నాయక్ పాల్గొని మాట్లాడారు. చీప్ విప్ మాట్లాడుతూ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధ్యం కాదన్న బీజేపీకి తెలంగాణలో స్థానం లేదన్నారు.
ఆ ఫ్యాక్టరీపై తెలంగాణ ప్రజలు పెట్టుకున్న కలలను బీజేపీ కల్లలు చేసిందని ఆరోపించారు.
అప్పట్లో కాంగ్రెస్ చేసిన ద్రోహాన్నే ఇపుడు బీజేపీ చేస్తుందని మండిపడ్డారు. పార్లమెంటు చేసిన చట్టంలో ఉన్న హామీలకే దిక్కు లేకపోతే.. ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నట్టా లేనట్టా..? అంటూ ప్రశ్నించారు.
రాజ్యాంగంపై, దర్యాప్తు సంస్థలపై బీజేపీ మోడీ ప్రభుత్వం పదునైన కత్తులతో దాడి చేస్తుందన్నారు. అన్నీ గుజరాత్ కు తరలించుకుపోతున్న బీజేపీని తెలంగాణ నుంచి తరలించాలన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా పనికిరాడంటూ.. కట్టు కథలు, కహానీలు చెబుతున్నారని విమర్శించారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిన విషయం పట్ల అసత్య ప్రచారం చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భద్రకాళి అమ్మవారి సాక్షిగా ప్రమాణానికి రావాలని సవాలు చేశారు. తెలంగాణ గడ్డ ప్రయోజనాలను కాపాడుకునేందుకు మేము ఎవరితోనైనా కొట్లాడుతాం.. మా హక్కులను సాధించి తీరుతామన్నారు.
తెలంగాణ పై బీజేపీ కక్ష: ఎంపీ పసునూరి
ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా పొందుపరిచిన రాష్ట్ర పునర్విభజన హామీలను అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష్యపురితంగా వ్యవహరించి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందన్నారు.
తెలంగాణ విభజన హామీలను నెరవేర్చకపోతే కచ్చితంగా పార్లమెంట్ సాక్షిగా కేంద్రంపై యుద్ధం చేస్తామని ఎంపీ హెచ్చరించారు.
మాజీ మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు సీతారాం నాయక్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం ఎంత పక్షపాతంగా వ్యవహరిస్తోంది అంటే.. విభజన హామీ అయిన గిరిజన విశ్వవిద్యాలయం ప్రకటించి…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించి కేంద్రానికి అప్పగించినప్పటికి ఇప్పటివరకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అత్యంత బాధాకరమైన చర్యగా పేర్కొన్నారు.
సమావేశంలో కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, బీఆర్ఎస్ నాయకులు మర్రి యాదవ రెడ్డి, పులి రజినీకాంత్, వేముల శ్రీనివాస్, నీలం సుహాస్, బి.ఆర్.ఎస్.వి డా.బొల్లికొండ వీరేందర్, డా.పాలమకుల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.