Dog | గొర్రెలు కాస్తున్న శునకం.. దాని పనితనం మీరూ చూడండి
విధాత: ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకు మన తోడుగా ఉన్న మరో జీవి కుక్క (Dog). వేటాడటం నుంచి కాపలా కాయడం వరకు.. ఈ కాలంలో అయితే ఒంటరి తనాన్ని దూరం చేసుకోవడానికి కూడా అవి మనకు ఉపయోగపడుతున్నాయి. తాజాగా ఒక గొర్రెల సమూహాన్ని శునకం నియంత్రిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఎగురుతూ.. దూకుతూ, వాటి మధ్య పరిగెడుతూ గొర్రెల సమూహాన్ని ఒక దారిన పెడుతుండటం నెటిజన్ల మనసు దోచుకుంది. బోర్డర్ కోలీ అనే […]

విధాత: ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకు మన తోడుగా ఉన్న మరో జీవి కుక్క (Dog). వేటాడటం నుంచి కాపలా కాయడం వరకు.. ఈ కాలంలో అయితే ఒంటరి తనాన్ని దూరం చేసుకోవడానికి కూడా అవి మనకు ఉపయోగపడుతున్నాయి. తాజాగా ఒక గొర్రెల సమూహాన్ని శునకం నియంత్రిస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
ఎగురుతూ.. దూకుతూ, వాటి మధ్య పరిగెడుతూ గొర్రెల సమూహాన్ని ఒక దారిన పెడుతుండటం నెటిజన్ల మనసు దోచుకుంది. బోర్డర్ కోలీ అనే ఈ శునకం హెర్డింగ్ డాగ్ జాతికి చెందినది. ఈ జాతి కుక్కలను గొర్రెల కాపరులు, రైతులు కాపలా కాయడానికి ఉపయోగిస్తారు. తెలివైన జాతి శునకాల్లో ఇవి మొదటి స్థానంలో ఉంటాయి.
He knows his work very well
— The Best (@Figensport) July 3, 2023
ఈ వీడియోపై పలువురు యూజర్లు స్పందించారు. హెర్డింగ్ డాగ్‌లకు ఒకటి లేదా రెండు సార్లు చెబితే చాలు అర్థం చేసుకుంటాయి. కొన్నింటికి 40 సార్లు చెప్పాలి అది వేరే విషయం అని ఒకరు వ్యాఖ్యానించారు. అంతెత్తున ఓ కుక్క గాల్లోకి ఎగరడం తాను ఇప్పటి వరకూ చూడలేదని మరొకరు స్పందించారు