Hyderabad | హైద‌రాబాద్‌లో దంచికొట్టిన వాన‌.. నాలాలో ప‌డి చిన్నారి మృతి

Hyderabad | శ‌నివారం తెల్ల‌వారుజామున హైద‌రాబాద్ న‌గ‌రంలో వాన దంచికొట్టింది. ఓ రెండు గంట‌ల పాటు ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షం కురిసింది. ఈ భారీ వ‌ర్షానికి నాలాలు పొంగిపొర్లాయి. ప‌లు చోట్ల రోడ్ల‌పై వ‌ర్ష‌పు నీరు నిలిచిపోయింది. సికింద్రాబాద్‌లో కురిసిన భారీ వ‌ర్షానికి క‌ళాసిగూడ ప్ర‌భుత్వ పాఠ‌శాల ముందున్న నాలా పుట్‌పాత్ పైక‌ప్పు వ‌ద్ద గుంత ఏర్ప‌డింది. వ‌ర్ష‌పు నీటిలో న‌డుచుకుంటూ వెళ్తున్న ఆరేండ్ల చిన్నారి ఆ గుంత‌లో ప‌డిపోయింది. దీంతో ఆ పాప నాలాలో కొట్టుకుపోయి […]

Hyderabad | హైద‌రాబాద్‌లో దంచికొట్టిన వాన‌.. నాలాలో ప‌డి చిన్నారి మృతి

Hyderabad | శ‌నివారం తెల్ల‌వారుజామున హైద‌రాబాద్ న‌గ‌రంలో వాన దంచికొట్టింది. ఓ రెండు గంట‌ల పాటు ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షం కురిసింది. ఈ భారీ వ‌ర్షానికి నాలాలు పొంగిపొర్లాయి. ప‌లు చోట్ల రోడ్ల‌పై వ‌ర్ష‌పు నీరు నిలిచిపోయింది.

సికింద్రాబాద్‌లో కురిసిన భారీ వ‌ర్షానికి క‌ళాసిగూడ ప్ర‌భుత్వ పాఠ‌శాల ముందున్న నాలా పుట్‌పాత్ పైక‌ప్పు వ‌ద్ద గుంత ఏర్ప‌డింది. వ‌ర్ష‌పు నీటిలో న‌డుచుకుంటూ వెళ్తున్న ఆరేండ్ల చిన్నారి ఆ గుంత‌లో ప‌డిపోయింది. దీంతో ఆ పాప నాలాలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయింది.

ఆ చిన్నారి పాల కోస‌మ‌ని బ‌య‌ట‌కు రాగా, నాలాలో ప‌డి ప్రాణాలు కోల్పోయిన‌ట్లు స్థానికులు తెలిపారు. నాలాలో ప‌డి కొంత దూరం కొట్టుకుపోయి, మ్యాన్ హోల్ వ‌ద్ద పాప చిక్కుకుంది. గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు, జీహెచ్ఎంసీ అధికారుల‌కు స‌మాచారం అందించారు.

ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు స్థానికుల స‌హాయంతో పాప మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీశారు. అనంత‌రం డెడ్ బాడీని గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అధికారుల నిర్ల‌క్ష్యం కార‌ణంగానే పాప ప్రాణాలు కోల్పోయింద‌ని స్థానికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ప్రాణాలు కోల్పోయిన పాప‌ను మౌనిక‌గా పోలీసులు గుర్తించారు. మౌనిక త‌ల్లిదండ్రులు శ్రీనివాస్, రేణుక శోక‌సంద్రంలో మునిగిపోయారు. శ్రీనివాస్ వృత్తిరీత్యా గోల్డ్ స్మిత్ వ‌ర్క‌ర్.