రక్షించిన రైతు పట్ల నాగుపాము కృతజ్ఞత

తనను రక్షించిన ఓ రైతు పట్ల విషనాగు కృతజ్ఞత ప్రదర్శిస్తున్న ఘటన ఆసక్తిరేపుతుంది.

రక్షించిన రైతు పట్ల నాగుపాము కృతజ్ఞత
  • నాగదేవతగా కొలుస్తున్న గ్రామస్తులు

విధాత : తనను రక్షించిన ఓ రైతు పట్ల విషనాగు కృతజ్ఞత ప్రదర్శిస్తున్న ఘటన ఆసక్తిరేపుతుంది. మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలంలోని భుజరంపేట కూకట్‌పల్లి శివారులో కర్నె హరీష్ రెడ్డి అనే రైతు తన మామిడ తోటకు కంచెగా వేసిన వలలో ఓ రోజు నాగుపాముు చిక్కుకుంది. గమనించిన హరీశ్‌రెడ్డి పామును కాపాడి ఎలాంటి హానీ తలపెట్టకుండా వదిలిపెట్టాడు. దీంతో పాము సమీప అడవుల్లోకి వెళ్లిపోయింది.


అయితే ఆ తర్వాతా ఆ పాము నిత్యం మామిడ తోట వద్దకు వచ్చి అక్కడే ఉన్న ఓ చెట్టుపైకి ఎక్కి పడగవిప్పి తనను కాపాడిన రైతును చూడటం పరిపాటిగా మారింది. చెట్టుపై నుంచి తోటలో పనిచేసుకుంటున్న రైతును చూసి, సాయంత్రం ఆయన ఇంటికి వెళ్లిపోయిన తర్వాతా పాము వెళ్లిపోవడం సాగుతుంది. దాదాపుగా ఏడాది నుంచి ఇదే తంతు సాగుతుంది. గ్రామస్తులు ఈ చోద్యాన్ని చూస్తూ ఆ దారి గుండా వెళుతూ అది సాధారణ పాము కాకపోవచ్చని, నాగ దేవత అయి ఉంటుందని దండం పెట్టుకుని తమ పనులకు వెలుతున్నారు.