సంక్షేమ పథకాలు కావాలా.. ఆధార్ అప్డేట్ తప్పనిసరి: కలెక్టర్ జితేష్ పాటిల్
విధాత: కామారెడ్డి జిల్లాలోని పౌరులంతా తప్పనిసరిగా ఆధార్ నవీకరణ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కల్లెక్టరేట్లో గురువారం జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 5-15 ఏళ్ల వయసున్న పిల్లలకు ఆధార్ కేంద్రంలో ఎలాంటి చార్జీలు ఉండవని సూచించారు. జిల్లాలోని మీసేవ, ఆధార్ కేంద్రాలను తనిఖీలు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు […]

విధాత: కామారెడ్డి జిల్లాలోని పౌరులంతా తప్పనిసరిగా ఆధార్ నవీకరణ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కల్లెక్టరేట్లో గురువారం జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 5-15 ఏళ్ల వయసున్న పిల్లలకు ఆధార్ కేంద్రంలో ఎలాంటి చార్జీలు ఉండవని సూచించారు. జిల్లాలోని మీసేవ, ఆధార్ కేంద్రాలను తనిఖీలు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు, పౌర సేవలను పొందాల నుకునే వారు ఆధార్ నవీకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. 2016 కంటే ముందు ఆధార్ గుర్తింపు కార్డు పొందిన వారంతా యు.ఐ.డీ.ఏ.ఐ. ఆదేశాల ప్రకారం సంబంధిత పత్రాలతో మీసేవ కేంద్రాలను సంప్రదించి నవీకరణ చేసుకోవాలన్నారు.
నవీకరణ ప్రక్రియకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని మీసేవ ఈ- డిస్టిక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ ను కలెక్టర్ ఆదేశించారు. వివిధ ఉద్యోగాల దరఖాస్తులు, బ్యాంకు ఖాతాలు, ధ్రువపత్రాలు పొందేందుకు, స్థలాల రిజిస్ట్రేషన్, సిమ్ కార్డు తీసుకునేందుకు, రేషన్ కార్డు పొందడం వంటి పలు సేవలు సులభంగా పొందాలంటే ఈ ప్రక్రియ వేగంగా పూర్తి చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
ఓటరు గుర్తింపు కార్డు వివరాలను కూడా ఆధార్ కు అనుసంధానం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఎల్డిఎం చిందం రమేష్, ఆధార్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.