Nalgonda | పేలిన AC కంప్రెషర్.. ఇద్దరు మృతి! శరీర భాగాలు చిన్నాభిన్నం

విధాత: నల్లగొండ (Nalgonda) పట్టణంలో మిర్యాలగూడ రోడ్డు బర్కత్ పుర కాలనీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వెటర్నరీ హాస్పిటల్ సమీపంలో న్యూ స్టార్ ఫ్రూట్ గౌడన్‌లో బనాన ఏసీ కంప్రెషర్ పేలి ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కోల్డ్ స్టోరేజీ ఓనర్ షేక్ కలీమ్, అందులో పనిచేసే వ్యక్తి సాజిద్ మృతులుగా గుర్తించారు. పేలుడు జరిగిన సమయంలో అక్కడ నలుగురు వ్యక్తులు ఆ స్టోరీజి పేలుడు నుంచి తప్పించుకున్నట్లు అక్కడి వారు తెలిపారు. NOTE: DISTURBING […]

Nalgonda | పేలిన AC కంప్రెషర్.. ఇద్దరు మృతి! శరీర భాగాలు చిన్నాభిన్నం

విధాత: నల్లగొండ (Nalgonda) పట్టణంలో మిర్యాలగూడ రోడ్డు బర్కత్ పుర కాలనీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వెటర్నరీ హాస్పిటల్ సమీపంలో న్యూ స్టార్ ఫ్రూట్ గౌడన్‌లో బనాన ఏసీ కంప్రెషర్ పేలి ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

కోల్డ్ స్టోరేజీ ఓనర్ షేక్ కలీమ్, అందులో పనిచేసే వ్యక్తి సాజిద్ మృతులుగా గుర్తించారు. పేలుడు జరిగిన సమయంలో అక్కడ నలుగురు వ్యక్తులు ఆ స్టోరీజి పేలుడు నుంచి తప్పించుకున్నట్లు అక్కడి వారు తెలిపారు.

పేలుడు ధాటికి వారి శరీర అవయవాలు తెగిపడ్డాయి. ప్రమాద స్థలం బీభత్సంగా మారింది. పేలుడుతో ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

నల్లగొండ ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, డి.ఎస్.పి నరసింహారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా ఎస్పీ అపూర్వరావు కూడా ఘటన స్థలాన్ని సందర్శించనున్నారు.