ఒంగోలు: చంద్రబాబు సభలో ప్రమాదం.. కాలువలో పడి.. ఏడుగురు మృతి

మ‌రో ఐదుగురికి తీవ్ర గాయాలు మ‌రికొంత‌మంది ప‌రిస్థితి విషమం విధాత‌: ఒంగోలు జిల్లాలో చంద్రబాబు సభకు భారీగా తరలివచ్చిన జనం మధ్యలో తోపులాట జరిగింది. దీంతో జనం అదుపుతప్పి పక్కనే ఉన్న మురుగు కాల్వలో పడి ఏకంగా ఏడుగురు చనిపోయారు. తోపులాటలో కాలువలో కార్యకర్తలు పడిపోవడంతో 8 మంది అపస్మారక స్థితిలోకి పోయారు. దీంతో వారిని హుటాహుటిన అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. కందుకూరులో చంద్రబాబు బుధవారం నిర్వహించిన ఈ సభకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ […]

ఒంగోలు: చంద్రబాబు సభలో ప్రమాదం.. కాలువలో పడి.. ఏడుగురు మృతి
  • మ‌రో ఐదుగురికి తీవ్ర గాయాలు
  • మ‌రికొంత‌మంది ప‌రిస్థితి విషమం

విధాత‌: ఒంగోలు జిల్లాలో చంద్రబాబు సభకు భారీగా తరలివచ్చిన జనం మధ్యలో తోపులాట జరిగింది. దీంతో జనం అదుపుతప్పి పక్కనే ఉన్న మురుగు కాల్వలో పడి ఏకంగా ఏడుగురు చనిపోయారు.

తోపులాటలో కాలువలో కార్యకర్తలు పడిపోవడంతో 8 మంది అపస్మారక స్థితిలోకి పోయారు. దీంతో వారిని హుటాహుటిన అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు.

కందుకూరులో చంద్రబాబు బుధవారం నిర్వహించిన ఈ సభకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అదే సమయంలో కార్యకర్తల మధ్యలో తోపులాట జరగడంతో పక్కనే ఉన్న గుడంకట్ట ఔట్ లెట్ కెనాల్ లో పడిపోయారు.

చంద్రబాబు అలెర్ట్ అయ్యి వెంటనే వారిని ఆస్పత్రికి తరలించేలా చేశారు. క్షతగాత్రులను తరలించగా చికిత్స పొందుతూ ఏడుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దీంతో చంద్రబాబు తన ప్రసంగాన్ని ఆపి ఆస్పత్రికి వెళ్లారు.

బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చంద్రబాబు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల సాయం ప్రకటించిన బాబు.. గాయపడిన వారికి పార్టీ అండగా ఉంటుందని.. బాధితుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యాసంస్థల్లో చదివిస్తామని హామీనిచ్చారు.

ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా చంద్రబాబు సభలకు జనం భారీగా వస్తున్నారు. ఈ క్రమంలో సభా నిర్వహణ ప్రదేశం వంటి వాటి విషయంలో అప్రమత్తత అవసరాన్ని ఈ ఒంగోలు సభ అలెర్ట్ చేస్తోంది.