జూనియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచారం.. తెలుగు సినీ నటుడు ప్రియాంత్ అరెస్ట్
విధాత, హైదరాబాద్: సినీ నటుడు ప్రియాంత్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడంటూ ప్రియాంత్‌పై జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు కులం పేరుతో దూషించాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రియాంత్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘కొత్తగా మా ప్రయాణం’ సినిమా చిత్రీకరణ సమయంలో హిరో ప్రియాంత్‌కు ఓ జూనియర్ ఆర్టిస్ట్‌తో […]

విధాత, హైదరాబాద్: సినీ నటుడు ప్రియాంత్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడంటూ ప్రియాంత్‌పై జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు కులం పేరుతో దూషించాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రియాంత్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘కొత్తగా మా ప్రయాణం’ సినిమా చిత్రీకరణ సమయంలో హిరో ప్రియాంత్‌కు ఓ జూనియర్ ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం రెండు నెలల తర్వాత ఆమెకు ప్రియాంత్ ప్రపోజ్ చేశాడు. అప్పటి నుంచి వారి ప్రేమ ప్రయాణం కొనసాగింది. ఈ క్రమంలో ఒక రోజు హైదరాబాద్ శివార్‌లో ప్రగతి రిసార్ట్‌కు తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
అంతేకాకుండా శ్రీనగర్ కాలనీలో ఉన్న కార్యాలయానికి కూడా తీసుకెళ్లి పలుమార్లు లైంగికంగా వేధింపులకు గురి చేశాడని.. చివరకు గర్భం దాల్చడంతో మొహం చాటేశాడని పేర్కొంది. అబార్షన్ కోసం మెడిసెన్స్ ఇవ్వడంతో అనారోగ్యం పాలయ్యానని.. అంతేకాకుండా విషయం బయటకు చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడని బాధితురాలు పోలీసులకు తెలియజేసింది.

అయితే కొద్ది రోజుల తర్వాత యువతి పెళ్లి మాట ఎత్తగా ప్రియాంత్ మాట దాటేయడంతో అసలు విషయం బయటపడింది. అతనికి ముందే పెళ్లి అయ్యిందని తెలిసి ఆ యువతి నీలదీయగా నా భార్య అంటే నాకు ఇష్టం లేదని, తనకి విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. నెలలు గడుస్తున్నా ప్రియాంత్ పెళ్లి చేసుకోకపోవడంతో మరోసారి అతన్ని నీలదీయగా చంపేస్తానని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించింది.
దీంతో అప్పటినుంచి పోలీసుల కంట పడకుండా లాయర్ ద్వారా వ్యవహారం నడిపిస్తున్న ప్రియాంత్‌ను పొలీసులు ఎట్టకేలకు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. ప్రియాంత్‌రావుపై జూ.ఆర్టిస్ట్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు చీటింగ్, రేప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.