Adilabad | వరదల ఉధృతి.. తెగిన అందవెల్లి తాత్కాలిక వంతెన.. ఒకరు గల్లంతు
Adilabad గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు నిలిచిన రాకపోకలు విధాత, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం అందవెల్లి పెద్దవాగు పై నిర్మించిన బ్రిడ్జి గత వర్షాకాలంలో కూలిన విషయం విదితమే. అప్పటి నుండి రాకపోకల కోసం వాగు పైన పైపులతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు. కొద్ది రోజులుగా ఎగువన తరచూ కురుస్తున్న వర్షాలతో బుధవారం తాత్కాలిక వంతెన పై నుండి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో తాత్కాలిక వంతెన […]

Adilabad
- గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
- నిలిచిన రాకపోకలు
విధాత, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం అందవెల్లి పెద్దవాగు పై నిర్మించిన బ్రిడ్జి గత వర్షాకాలంలో కూలిన విషయం విదితమే. అప్పటి నుండి రాకపోకల కోసం వాగు పైన పైపులతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు.
కొద్ది రోజులుగా ఎగువన తరచూ కురుస్తున్న వర్షాలతో బుధవారం తాత్కాలిక వంతెన పై నుండి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో తాత్కాలిక వంతెన తెగిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ తాత్కాలిక వంతెన వద్ద ప్రమాదం పొంచి ఉందని ప్రజలు చెబుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్థానిక రైతులు, ప్రయాణీకులు వాగు దాటి తమ తమ పనులకు వెళ్తున్నారు.
సంబంధించిన ఆరు పిల్లర్ల పొడుగు బ్రిడ్జి కూలడంతో వాటి స్థానంలో కొత్త పిల్లర్లు నిర్మాణం చేసే క్రమంలో పక్క నుండి వెళ్లడానికి తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు.నిన్న సాయంత్రం మల్లేష్ రైతు బంధు డబ్బుల కోసం కాగజ్నగర్ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వాగు దాటుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్ధృతి పెరిగి మల్లేష్ వాగులో గల్లంతయ్యాడు. జిల్లాలోని దహెగాం మండలం బిబ్రా గ్రామనికి చెందిన మల్లేష్ ఆచూకి ఇంకా లభించలేదు. మల్లేష్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
అందవెల్లి పెద్దవాగు పై గత నాలుగు సంవత్సరాల క్రితం బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. గత సంవత్సరం భారీ వర్షాల మూలంగా బ్రిడ్జి పిల్లర్లు కుంగడంతో బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. బ్రిడ్జికి
ఎగువన కురిసిన భారీ వర్షాలకు వాగు ఉప్పొంగడంతో తాత్కాలిక వంతెన తెగిపోయి దాదాపు 20 నుండి 30 గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతి వర్షాకాలంలో ఈ అందవెల్లి పెద్ద వాగు పై ఉన్న బ్రిడ్జి దగ్గర ఎప్పుడు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.
బ్రిడ్జి పిల్లర్లు వాగులో కూరుకుపోయి, కూలిపోవడం అంటే సంబంధిత కాంట్రాక్టర్ ఎంత పటిష్టంగా నాణ్యతతో కూడిన బ్రిడ్జి నిర్మించాడో అర్థమవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నిర్మించిన మూడు సంవత్సరాలకి బ్రిడ్జి కూలిపోవడం దానిని పునర్నిర్మాణం చేయడం మళ్లీ అది ఎన్ని రోజులు పడుతుందో ఎన్ని సంవత్సరాలు మన్నికతో ఉంటుందో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.