Adilabad | సదర్ మాట్ కెనాల్ లో పదో తరగతి విద్యార్థి గల్లంతు

Adilabad విధాత: ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మేడపెల్లి గ్రామ శివారు లోని సదర్ మట్ కెనల్ లో విద్యార్థి గల్లంతయ్యాడు. జగిత్యాల జిల్లా మెటుపెల్లిలోని పురాణ కాలనీకి చెందిన ఐదుగురు విద్యార్థులు సరదాగా మెట్ పల్లి నుండి ఖానాపూర్ కు ఆటోలో వచ్చారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు షేక్ రెహ్మాన్, సులేమాన్, ఇమ్రాన్, అజీమ్, ముల్తాన్ లు ఆటోలో వచ్చి సదర్ మాట్ కెనాల్ లో స్నానం చేస్తుండగా, […]

Adilabad | సదర్ మాట్ కెనాల్ లో పదో తరగతి విద్యార్థి గల్లంతు

Adilabad

విధాత: ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మేడపెల్లి గ్రామ శివారు లోని సదర్ మట్ కెనల్ లో విద్యార్థి గల్లంతయ్యాడు. జగిత్యాల జిల్లా మెటుపెల్లిలోని పురాణ కాలనీకి చెందిన ఐదుగురు విద్యార్థులు సరదాగా మెట్ పల్లి నుండి ఖానాపూర్ కు ఆటోలో వచ్చారు.

ఈ రోజు సాయంత్రం 5 గంటలకు షేక్ రెహ్మాన్, సులేమాన్, ఇమ్రాన్, అజీమ్, ముల్తాన్ లు ఆటోలో వచ్చి సదర్ మాట్ కెనాల్ లో స్నానం చేస్తుండగా, నీటి ప్రవాహానికి ఈత రాక ప్లడ్ గేట్ తూములో షేక్ రేహన్ ఇరుక్కు పోయినాడు .

విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని తూములో ఇరుక్కున్న షేక్ రెహమాన్ ను బయటకు తీయగా అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు